(॥పల్లవి॥)
వట్టి సటలకు తల వంచ నేలే
మట్టుమీరే పని యైతే మానుప కుండేనా
(॥వట్టి॥)
కాతరాన నీవిభుఁడు కదిసి యేపొద్దు నీ
చేతికి లో నై యుండఁగ చింత లేలే
ఆతల నొక్కతెయింట నాతఁ డుండఁగాఁ జూచితే
యేతుల నీ వే మన్న నియ్యకొందుఁ గాకా
(॥వట్టి॥)
చంచలము దీరీ నిన్ను సమ్మతించఁ జెప్పి నీతో
ముంచి నవ్వులు నవ్వఁగ ముసుఁ గేలే
పంచల నాతఁడు వేరే పరా కై వుంటేఁ గనక
వంచన నీకుఁ గా పత్రివాదుల మై యుండేమా
(॥వట్టి॥)
అక్కజపు యేకతాన నంగము లంటుచు నీ
చెక్కులు నొక్కఁగా నీకు సిగ్గు లేలే
అక్కర శ్రీవెంటకేశుఁ డలమేలుమంగవు నీ
విక్కువతోఁ గూడితివి యిట్టె సంతోసించవే
(||pallavi||)
vaṭṭi saḍalagu tala vaṁcha nele
maṭṭumīre pani yaide mānuba kuṁḍenā
(||vaṭṭi||)
kādarāna nīvibhum̐ḍu kadisi yebŏddu nī
sedigi lo nai yuṁḍam̐ga siṁta lele
ādala nŏkkadĕyiṁṭa nādam̐ ḍuṁḍam̐gām̐ jūside
yedula nī ve manna niyyagŏṁdum̐ gāgā
(||vaṭṭi||)
saṁchalamu dīrī ninnu sammadiṁcham̐ jĕppi nīdo
muṁchi navvulu navvam̐ga musum̐ gele
paṁchala nādam̐ḍu vere parā kai vuṁṭem̐ ganaga
vaṁchana nīgum̐ gā patrivādula mai yuṁḍemā
(||vaṭṭi||)
akkajabu yegadāna naṁgamu laṁṭusu nī
sĕkkulu nŏkkam̐gā nīgu siggu lele
akkara śhrīvĕṁṭageśhum̐ ḍalamelumaṁgavu nī
vikkuvadom̐ gūḍidivi yiṭṭĕ saṁtosiṁchave