వట్టి సటలకు నింత వాసు లేల
(॥పల్లవి॥)
వట్టి సటలకు నింత వాసు లేల
మెట్టుక వున్నాఁ డతఁడు మేలమాడ రాదా
(॥వట్టి॥)
కూడి వుండినట్టిచోట గోప మేల మంచి
జాడకు వచ్చియు మరిఁ జల మేల
వేడుకలలోపల విసు పేల
వీడె మిచ్చీ నాతఁడు వేగ నందుకోవే
(॥వట్టి॥)
మేర మీర రానీ నీతో మెణ కేల నిన్ను
గారవించఁగా యాడో కత లేల
నేరము లేనివెనక నెగు లేలా నిన్ను
సారెకుఁ జెక్కు నొక్కీని చనవు చేకోవే
(॥వట్టి॥)
మంతన మై యుండఁగాను మరఁగేల
పంత మిచ్చినందుమీఁద బలిమేల
యింతలో శ్రీవెంకటేశుఁడిటు గూడెను
మంతు కెక్కెఁ దొల్లిటిమాట లిఁక నేలే
(||pallavi||)
vaṭṭi saḍalagu niṁta vāsu lela
mĕṭṭuga vunnām̐ ḍadam̐ḍu melamāḍa rādā
(||vaṭṭi||)
kūḍi vuṁḍinaṭṭisoḍa goba mela maṁchi
jāḍagu vachchiyu marim̐ jala mela
veḍugalalobala visu pela
vīḍĕ michchī nādam̐ḍu vega naṁdugove
(||vaṭṭi||)
mera mīra rānī nīdo mĕṇa kela ninnu
gāraviṁcham̐gā yāḍo kada lela
neramu lenivĕnaga nĕgu lelā ninnu
sārĕgum̐ jĕkku nŏkkīni sanavu segove
(||vaṭṭi||)
maṁtana mai yuṁḍam̐gānu maram̐gela
paṁta michchinaṁdumīm̐da balimela
yiṁtalo śhrīvĕṁkaḍeśhum̐ḍiḍu gūḍĕnu
maṁtu kĕkkĕm̐ dŏlliḍimāḍa lim̐ka nele