Vatti penamgulaadala valabu savulu gaadu

వట్టి పెనఁగులాటల వలపు చవులు గాదు
Language

(॥పల్లవి॥)
వట్టి పెనఁగులాటల వలపు చవులు గాదు
గుట్టుతో మెలఁగితేను గుణములు హెచ్చును

(॥వట్టి॥)
మనసు లెనసితేను మాటలు ప్రియములౌను
ననుపు గలిగితేను నమ్మికలౌను
చనవులు సతమైతే సరసము లింపౌను
వినయాలు చూపితేను వేడుకౌను పొందులు

(॥వట్టి॥)
సిగ్గువడ నేరిచితే చేఁతలు తరితీపౌను
యెగ్గులెల్లా మానితేను ఇతవౌఁ బొందు
వెగ్గళించి పొగడితే విభావాలు చెలరేఁగు
వొగ్గి వేఁడుకొంటేను వుల్లములు గరఁగు

(॥వట్టి॥)
తలపోఁత లొనరితే తమకము గడురేఁగు
నెలకొన నవ్వులను నిఁడు ముదము
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కలసితి మిద్దరముఁ గలుగుఁ జనవులు

(||pallavi||)
vaṭṭi pĕnam̐gulāḍala valabu savulu gādu
guṭṭudo mĕlam̐gidenu guṇamulu hĕchchunu

(||vaṭṭi||)
manasu lĕnasidenu māḍalu priyamulaunu
nanubu galigidenu nammigalaunu
sanavulu sadamaide sarasamu liṁpaunu
vinayālu sūbidenu veḍugaunu pŏṁdulu

(||vaṭṭi||)
sigguvaḍa neriside sem̐talu taridībaunu
yĕggulĕllā mānidenu idavaum̐ bŏṁdu
vĕggaḽiṁchi pŏgaḍide vibhāvālu sĕlarem̐gu
vŏggi vem̐ḍugŏṁṭenu vullamulu garam̐gu

(||vaṭṭi||)
talabom̐ta lŏnaride tamagamu gaḍurem̐gu
nĕlagŏna navvulanu nim̐ḍu mudamu
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kalasidi middaramum̐ galugum̐ janavulu