వట్టి పరాకు సేయఁగ వచ్చే దేమి
(॥పల్లవి॥)
వట్టి పరాకు సేయఁగ వచ్చే దేమి
యెట్టై నాఁ గూడకపోదు ఇఁక నేల మఱుఁగు
(॥॥)
సెలవి నవ్విన నవ్వు సిగ్గుల వెన్నెల పువ్వు
పలుకుఁ దేనెల సోన బంగారు వాన
లలితాంగి నీకు నిదే లంచమిచ్చీ యెదుటను
యెలమిఁ జేకొనవయ్య ఇఁకనేల మఱుఁగు
(॥॥)
తొంగి చూపుల మొక్కులు తుమ్మిదపిండు రెక్కలు
పొంగేటి చనుఁగొనలు పూఁప మొనలు
అంగన కానుక వట్టీ నదివో నీకు నేఁడు
ఇంగితాన నియ్యకొను ఇఁక నేల మఱుఁగు
(॥॥)
గట్టి గోరిరేకలు కంతు ముద్రలేకలు
తొట్టి న యీకౌఁగిలి రతుల లోఁగిలి
నెట్టన శ్రీ వేంకటేశ నెలఁత సూడిదె వట్టే
యిట్టే యేలవయ్య ఇఁక నేల మఱుఁగు
(||pallavi||)
vaṭṭi parāgu seyam̐ga vachche demi
yĕṭṭai nām̐ gūḍagabodu im̐ka nela maṟum̐gu
(||||)
sĕlavi navvina navvu siggula vĕnnĕla puvvu
palugum̐ denĕla sona baṁgāru vāna
lalidāṁgi nīgu nide laṁchamichchī yĕduḍanu
yĕlamim̐ jegŏnavayya im̐kanela maṟum̐gu
(||||)
tŏṁgi sūbula mŏkkulu tummidabiṁḍu rĕkkalu
pŏṁgeḍi sanum̐gŏnalu pūm̐pa mŏnalu
aṁgana kānuga vaṭṭī nadivo nīgu nem̐ḍu
iṁgidāna niyyagŏnu im̐ka nela maṟum̐gu
(||||)
gaṭṭi goriregalu kaṁtu mudralegalu
tŏṭṭi na yīgaum̐gili radula lom̐gili
nĕṭṭana śhrī veṁkaḍeśha nĕlam̐ta sūḍidĕ vaṭṭe
yiṭṭe yelavayya im̐ka nela maṟum̐gu