వట్టి పారుపత్యములు వదలక చేయఁజొచ్చె
(॥పల్లవి॥)
వట్టి పారుపత్యములు వదలక చేయఁజొచ్చె
యెట్టుండితిమేమి తనకేలే యీ పనులు
(॥వట్టి॥)
కొప్పు ముడువఁగాఁ జూచి గోరుసేసి నానెరులు
యిప్పుడెన్ని గలవంటానేఁకరీ వీఁడు
చిప్పలవంటి కన్నులు చేరఁడేసి కలవంటా
వుప్పటించీఁ దనకేమి వుండఁబట్టదా
(॥వట్టి॥)
కోక గట్టుకోఁగాఁ జూచి గొప్పలు నాచన్నులంటా
యీకడఁ జేతులు చాఁచీనేలే వీఁడు
దాకొన్న పలువరుస దంతములఁ బోలునంటా
చేకొని పొగడఁజొచ్చె చెల్లునా తనకు
(॥వట్టి॥)
ఆకు మడుచుకొఁగాను అట్టె గోళ్లు వాఁడెంటా
సాకిరి నా తన గోళ్ళు సరి వెట్టేనే
శ్రీకాంతనిదె నేను శ్రీవేంకటేశుఁడు దాను
యేకాలము నన్నుఁగూడె నేమందునే
(||pallavi||)
vaṭṭi pārubatyamulu vadalaga seyam̐jŏchchĕ
yĕṭṭuṁḍidimemi tanagele yī panulu
(||vaṭṭi||)
kŏppu muḍuvam̐gām̐ jūsi gorusesi nānĕrulu
yippuḍĕnni galavaṁṭānem̐karī vīm̐ḍu
sippalavaṁṭi kannulu seram̐ḍesi kalavaṁṭā
vuppaḍiṁchīm̐ danagemi vuṁḍam̐baṭṭadā
(||vaṭṭi||)
koga gaṭṭugom̐gām̐ jūsi gŏppalu nāsannulaṁṭā
yīgaḍam̐ jedulu sām̐sīnele vīm̐ḍu
dāgŏnna paluvarusa daṁtamulam̐ bolunaṁṭā
segŏni pŏgaḍam̐jŏchchĕ sĕllunā tanagu
(||vaṭṭi||)
āgu maḍusugŏm̐gānu aṭṭĕ goḽlu vām̐ḍĕṁṭā
sāgiri nā tana goḽḽu sari vĕṭṭene
śhrīgāṁtanidĕ nenu śhrīveṁkaḍeśhum̐ḍu dānu
yegālamu nannum̐gūḍĕ nemaṁdune