Vatti neraale yemturu valabulu saalagunna

వట్టి నేరాలే యెంతురు వలపులు చాలకున్న
Language

(॥పల్లవి॥)
వట్టి నేరాలే యెంతురు వలపులు చాలకున్న
యెట్టివారి కిదె నీవు యేమి సేతువయ్యా

(॥వట్టి॥)
మందలించి నీమాటకు మారు మాటాడ కుండితే
కందువది నీ కెంత గర్వమనేవు
అంది నీకతలకు నే నౌఁగాదని యంటేను
యిందులోనే యిది చూడ నెంతదం టనేవు

(॥వట్టి॥)
నీవు దప్పక చూచితే నేనుఁ జూడకుండితే
కేవలమై నీతో నలిగితి ననేవు
భావించి నీరూపమెల్ల పైపై నేఁ జూచితేను
సోవలుగా నిన్నింత సోదించే ననేవు

(॥వట్టి॥)
గక్కునఁ గూడితివి నేఁగాఁగిలించకుండితేను
వెక్కసపు నెరజాణ వీఁగె ననేవు
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నేనే నిన్నుఁబైకొంటె
గుక్కక యింకా రతులఁ గొరఁ జూచేవు

(||pallavi||)
vaṭṭi nerāle yĕṁturu valabulu sālagunna
yĕṭṭivāri kidĕ nīvu yemi seduvayyā

(||vaṭṭi||)
maṁdaliṁchi nīmāḍagu māru māḍāḍa kuṁḍide
kaṁduvadi nī kĕṁta garvamanevu
aṁdi nīgadalagu ne naum̐gādani yaṁṭenu
yiṁdulone yidi sūḍa nĕṁtadaṁ ṭanevu

(||vaṭṭi||)
nīvu dappaga sūside nenum̐ jūḍaguṁḍide
kevalamai nīdo naligidi nanevu
bhāviṁchi nīrūbamĕlla paibai nem̐ jūsidenu
sovalugā ninniṁta sodiṁche nanevu

(||vaṭṭi||)
gakkunam̐ gūḍidivi nem̐gām̐giliṁchaguṁḍidenu
vĕkkasabu nĕrajāṇa vīm̐gĕ nanevu
nikki śhrī veṁkaḍeśhum̐ḍa nene ninnum̐baigŏṁṭĕ
gukkaga yiṁkā radulam̐ gŏram̐ jūsevu