Vatti mamdaadamu lela vaddana nelaa

వట్టి మండాటము లేల వద్దన నేలా
Language

(॥పల్లవి॥)
వట్టి మండాటము లేల వద్దన నేలా
యిట్టె నీ పతి వీఁడె యేమైన ననవే

(॥వట్టి॥)
వలవనిజోతి యాల వాదుటాల మా కేల
తలఁచఁగానె యాతఁడు తానే వచ్చెను
పొలసి యిందాఁక నేము పూనుక వచ్చితి మింతే
చెలువుఁడు వాఁడె నీవు సేసినట్టు నేయవే

(॥వట్టి॥)
ఆన వెట్ట నా కేల అంతేసి పంతము లేల
వీనుల నాతఁడు దానే వినుచున్నాఁడు
కానీవే ఆతఁడు నీవు గన్నదాఁకా గురియైతి
పోనీక యీతని కిన్ని బుద్దలూనుఁ జెప్పవే

(॥వట్టి॥)
చక్కటి సేయఁగ నేల చవులు చెప్పఁగ నేల
గక్కన నాతఁడును నిన్నుఁ గాఁగిలించెను
యిక్కువ శ్రీవెంకటేశుఁ డెనసి వున్నాఁడు నీతో
యిక్కడు నాతనితో నీ వెట్టయినఁ బెనఁగవే

(||pallavi||)
vaṭṭi maṁḍāḍamu lela vaddana nelā
yiṭṭĕ nī padi vīm̐ḍĕ yemaina nanave

(||vaṭṭi||)
valavanijodi yāla vāduḍāla mā kela
talam̐sam̐gānĕ yādam̐ḍu tāne vachchĕnu
pŏlasi yiṁdām̐ka nemu pūnuga vachchidi miṁte
sĕluvum̐ḍu vām̐ḍĕ nīvu sesinaṭṭu neyave

(||vaṭṭi||)
āna vĕṭṭa nā kela aṁtesi paṁtamu lela
vīnula nādam̐ḍu dāne vinusunnām̐ḍu
kānīve ādam̐ḍu nīvu gannadām̐kā guriyaidi
ponīga yīdani kinni buddalūnum̐ jĕppave

(||vaṭṭi||)
sakkaḍi seyam̐ga nela savulu sĕppam̐ga nela
gakkana nādam̐ḍunu ninnum̐ gām̐giliṁchĕnu
yikkuva śhrīvĕṁkaḍeśhum̐ ḍĕnasi vunnām̐ḍu nīdo
yikkaḍu nādanido nī vĕṭṭayinam̐ bĕnam̐gave