Vatti lampadamu vadala neradu gaana

వట్టి లంపటము వదల నేరదు గాన
Language

(॥పల్లవి॥)
వట్టి లంపటము వదల నేరదు గాన
పుట్టించిన హరి బుద్ధిలోనె కాఁడా

(॥వట్టి॥)
దేహాభిమానములు తెగి విడిచినఁ గాని
యీహల దేవుఁడు తన్ను నేల మెచ్చీనీ
సాహసించి కోరికెల సంగము మానకుండితే
వోహో పరమపద మూర కేల కలుగు

(॥వట్టి॥)
నిచ్చలును వైరాగ్యనిష్ఠుడు గాకుండితేను
యెచ్చిన జన్మాదు లెల్ల యేల కడచు
కొచ్చి కొచ్చి తనలోని కోపముడుగ కుండితే
అచ్చపు బ్రహ్మానంద మది యేల కలుగు

(॥వట్టి॥)
శ్రీ వేంకటాద్రి మీఁది శ్రీపతిఁ గొల్వకుండితే
సోవల నా దేవుఁ డిట్టె సులభుఁడవునా
భావించి తనలోని భక్తి నిలుపకుండితే
తావుల నన్నిటాను సంతత పుణ్యుఁ డవునా

(||pallavi||)
vaṭṭi laṁpaḍamu vadala neradu gāna
puṭṭiṁchina hari buddhilonĕ kām̐ḍā

(||vaṭṭi||)
dehābhimānamulu tĕgi viḍisinam̐ gāni
yīhala devum̐ḍu tannu nela mĕchchīnī
sāhasiṁchi korigĕla saṁgamu mānaguṁḍide
voho paramabada mūra kela kalugu

(||vaṭṭi||)
nichchalunu vairāgyaniṣhṭhuḍu gāguṁḍidenu
yĕchchina janmādu lĕlla yela kaḍasu
kŏchchi kŏchchi tanaloni kobamuḍuga kuṁḍide
achchabu brahmānaṁda madi yela kalugu

(||vaṭṭi||)
śhrī veṁkaḍādri mīm̐di śhrībadim̐ gŏlvaguṁḍide
sovala nā devum̐ ḍiṭṭĕ sulabhum̐ḍavunā
bhāviṁchi tanaloni bhakti nilubaguṁḍide
tāvula nanniḍānu saṁtada puṇyum̐ ḍavunā