Vatti lampadaalam badi vadam boraludagamte

వట్టి లంపటాలఁ బడి వడఁ బొరలుటకంటే
Language

(॥పల్లవి॥)
వట్టి లంపటాలఁ బడి వడఁ బొరలుటకంటే
వొట్టిన విరతి నూరకుండుటే సుఖము

(॥వట్టి॥)
పాపము మానినయట్టి బదుకొక్కటె సుఖము
కోపము విడిచినట్టి గుణమొక్కటి సుఖము
చేపట్టి గురుబుద్ధి సేసేటిదే సుఖము తీ-
దీపులఁ బడనియట్టి దినమే సుఖము

(॥వట్టి॥)
మహిఁ జంచలములేని మనసొక్కటి సుఖము
సహజాచారముతోడి జన్మమొక్కటి సుఖము
యిహపరసాధనపు యెన్నికొక్కటి సుఖము
బహుళపు టాసకంటె పరిపాటి సుఖము

(॥వట్టి॥)
పరులఁ బీడించితేని పసిఁడొక్కటి సుఖము
గరిమ నిజముతోడఁగల మాటలే సుఖము
ధరలో శ్రీవేంకటేశు దాసానుదాఁడయి
సరవితో నడచేటి శాంతమే సుఖము

(||pallavi||)
vaṭṭi laṁpaḍālam̐ baḍi vaḍam̐ bŏraluḍagaṁṭe
vŏṭṭina viradi nūraguṁḍuḍe sukhamu

(||vaṭṭi||)
pābamu māninayaṭṭi badugŏkkaḍĕ sukhamu
kobamu viḍisinaṭṭi guṇamŏkkaḍi sukhamu
sebaṭṭi gurubuddhi seseḍide sukhamu tī-
dībulam̐ baḍaniyaṭṭi diname sukhamu

(||vaṭṭi||)
mahim̐ jaṁchalamuleni manasŏkkaḍi sukhamu
sahajāsāramudoḍi janmamŏkkaḍi sukhamu
yihabarasādhanabu yĕnnigŏkkaḍi sukhamu
bahuḽabu ṭāsagaṁṭĕ paribāḍi sukhamu

(||vaṭṭi||)
parulam̐ bīḍiṁchideni pasim̐ḍŏkkaḍi sukhamu
garima nijamudoḍam̐gala māḍale sukhamu
dharalo śhrīveṁkaḍeśhu dāsānudām̐ḍayi
saravido naḍaseḍi śhāṁtame sukhamu