వట్టి కాతరాన నీవు వసివాడే రింతేకాక
(॥పల్లవి॥)
వట్టి కాతరాన నీవు వసివాడే రింతేకాక
చుట్టరికము నెరపి సొంపులెల్లా రేఁచదా
(॥వట్టి॥)
చెప్పినట్టు సేసేనని చిత్తము నీ సొమ్మని
అప్పుడే విన్నవించదా ఆపె నీతోను
యెప్పుడు నలుగనని యిచ్చకము సేతునని
ముప్పిరి నొడఁబరచి మోహమెల్లాఁ జూపదా
(॥వట్టి॥)
తానే నీవై యుండేనని దక్క వలచితినని
ఆనలెల్లాఁ బెట్టదా ఆపె నీతోను
మానలేని పొందులని మఱఁగులు వెట్టనని
కానుకలు నీకు నిచ్చి కడు బత్తిసేయదా
(॥వట్టి॥)
వెంగెములాడనని వెస నిన్నుఁ బాయనని
అంగజ కేలిఁ గూడదా యాపె నీతోను
రంగుగా శ్రీవేంకటేశ రతికెక్క చనవని
సింగారించుకొని వచ్చి సేసలెల్లాఁ బెట్టదా
(||pallavi||)
vaṭṭi kādarāna nīvu vasivāḍe riṁtegāga
suṭṭarigamu nĕrabi sŏṁpulĕllā rem̐sadā
(||vaṭṭi||)
sĕppinaṭṭu sesenani sittamu nī sŏmmani
appuḍe vinnaviṁchadā ābĕ nīdonu
yĕppuḍu naluganani yichchagamu sedunani
muppiri nŏḍam̐barasi mohamĕllām̐ jūbadā
(||vaṭṭi||)
tāne nīvai yuṁḍenani dakka valasidinani
ānalĕllām̐ bĕṭṭadā ābĕ nīdonu
mānaleni pŏṁdulani maṟam̐gulu vĕṭṭanani
kānugalu nīgu nichchi kaḍu battiseyadā
(||vaṭṭi||)
vĕṁgĕmulāḍanani vĕsa ninnum̐ bāyanani
aṁgaja kelim̐ gūḍadā yābĕ nīdonu
raṁgugā śhrīveṁkaḍeśha radigĕkka sanavani
siṁgāriṁchugŏni vachchi sesalĕllām̐ bĕṭṭadā