Vatti joli davvanela vachchevo ledo

వట్టి జోలి దవ్వనేల వచ్చేవో లేదో
Language

(॥పల్లవి॥)
వట్టి జోలి దవ్వనేల వచ్చేవో లేదో
ఇట్టే తారుకాణించ ఇది నాకుఁ దడవా

(॥వట్టి॥)
ముందట నీ వుండఁగాను మొగమోట మంటిఁగాక
ఇందు నిన్నుఁ గోపగించ నెంతలేదు
అంది చేయి వేయఁగాను అన్నీ మరచితిఁగాక
నిందలు నీ పై వేయ నేఁడు నాకుఁ దడవా

(॥వట్టి॥)
ముంచి నీవు నవ్వఁగాను మోహమే చల్లితిఁగాక
యెంచి నీతో నలుగఁగ నెంతలేదు
మంచానాకుఁ దియ్యగాను మనసుగలిగెఁగాక
పెంచి నీతో మారుకొని పెనఁగఁగడవా

(॥వట్టి॥)
గక్కనఁ గాఁగిలిచఁగఁ గళవట్టి వుంటిగాక
ఇక్కువఁ బచ్చిసేయుఁగ నెంతలేదు
చెక్కునొక్కి కూడితివి శ్రీ వేంకటేశ నన్ను
మొక్కితిఁగాక నిన్ను మోసపుచ్చఁదడవా

(||pallavi||)
vaṭṭi joli davvanela vachchevo ledo
iṭṭe tārugāṇiṁcha idi nāgum̐ daḍavā

(||vaṭṭi||)
muṁdaḍa nī vuṁḍam̐gānu mŏgamoḍa maṁṭim̐gāga
iṁdu ninnum̐ gobagiṁcha nĕṁtaledu
aṁdi seyi veyam̐gānu annī marasidim̐gāga
niṁdalu nī pai veya nem̐ḍu nāgum̐ daḍavā

(||vaṭṭi||)
muṁchi nīvu navvam̐gānu mohame sallidim̐gāga
yĕṁchi nīdo nalugam̐ga nĕṁtaledu
maṁchānāgum̐ diyyagānu manasugaligĕm̐gāga
pĕṁchi nīdo mārugŏni pĕnam̐gam̐gaḍavā

(||vaṭṭi||)
gakkanam̐ gām̐gilisam̐gam̐ gaḽavaṭṭi vuṁṭigāga
ikkuvam̐ bachchiseyum̐ga nĕṁtaledu
sĕkkunŏkki kūḍidivi śhrī veṁkaḍeśha nannu
mŏkkidim̐gāga ninnu mosabuchcham̐daḍavā