వట్టి గజరుల (?) నెంత వలపులఁ బొరలేరు
(॥పల్లవి॥)
వట్టి గజరుల (?) నెంత వలపులఁ బొరలేరు
అట్టే పెండ్లాడరాదా అనుమాన మేఁటికి
(॥॥)
నిక్కము వలెనే నీతో నిట్టూర్పు రేఁగఁగాను
గక్కనఁ దా నేమి చెప్పీఁ గతలు ఆపె
అక్కరతో మొగ మెత్తి యడియాసలతోనే
వెక్కసముగా నెందాఁకా వినేవు నీవూ
(॥॥)
సిగ్గులెల్ల నటువెట్టి చెమటలు గారఁగాను
దగ్గరేమి చూపీఁ జిత్తరువు నీకు
అగ్గమై శిరసు సెత్తుక ఆయము గరఁగుకొంటా
యెగ్గెఱుఁగ కాకె దిక్కే యెంత చూచేవు
(॥॥)
కుమ్మరింపు నవ్వులతోఁ గొప్పు గొంత జారఁగాను
నెమ్మి జూజాలాడ నేమి నేరిపీ నీకు
యిమ్ముల శ్రీ వేంకటేశ ఇట్టే నన్నుఁగూడితివి
అమ్మరో యేమి నేరిచే వాపె చేత నీవు
(||pallavi||)
vaṭṭi gajarula (?) nĕṁta valabulam̐ bŏraleru
aṭṭe pĕṁḍlāḍarādā anumāna mem̐ṭigi
(||||)
nikkamu valĕne nīdo niṭṭūrbu rem̐gam̐gānu
gakkanam̐ dā nemi sĕppīm̐ gadalu ābĕ
akkarado mŏga mĕtti yaḍiyāsaladone
vĕkkasamugā nĕṁdām̐kā vinevu nīvū
(||||)
siggulĕlla naḍuvĕṭṭi sĕmaḍalu gāram̐gānu
daggaremi sūbīm̐ jittaruvu nīgu
aggamai śhirasu sĕttuga āyamu garam̐gugŏṁṭā
yĕggĕṟum̐ga kāgĕ dikke yĕṁta sūsevu
(||||)
kummariṁpu navvuladom̐ gŏppu gŏṁta jāram̐gānu
nĕmmi jūjālāḍa nemi neribī nīgu
yimmula śhrī veṁkaḍeśha iṭṭe nannum̐gūḍidivi
ammaro yemi nerise vābĕ seda nīvu