Vatti doosagamulela vaadulela naagimka

వట్టి దూసకములేల వాదులేల నాకిఁక
Language

(॥పల్లవి॥)
వట్టి దూసకములేల వాదులేల నాకిఁక
దట్టముగ నీకు మంచిదాననై వుండేను

(॥వట్టి॥)
సరసుఁ డాడినమాఁట చక్కనే యందురుగాక
వొరయఁగవచ్చేరా వొకరైనను
ధరలో నేనొకతెను తప్పక నీమీఁదను
నెరుసు లెంచఁగఁబోతే నిజపట్టేరా

(॥వట్టి॥)
బలురాజు చేసే చేఁత పాడియుఁ బంతమెకాక
తలపోసి యెవ్వరైనాఁ దప్పు గొనేరా
వలచినదాన నేను వంతులకు నిన్ను మీరి
చలము సాదించేనంటే సాగఁబొయ్యీనా

(॥వట్టి॥)
మగఁడు వట్టితీసితేను మన్నించీ నందురుగాక
వెగటు లింతేఁటికి విడుమనేరా
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
నగి సిగ్గువడితేను నమ్మికయ్యీనా

(||pallavi||)
vaṭṭi dūsagamulela vādulela nāgim̐ka
daṭṭamuga nīgu maṁchidānanai vuṁḍenu

(||vaṭṭi||)
sarasum̐ ḍāḍinamām̐ṭa sakkane yaṁdurugāga
vŏrayam̐gavachcherā vŏgarainanu
dharalo nenŏgadĕnu tappaga nīmīm̐danu
nĕrusu lĕṁcham̐gam̐bode nijabaṭṭerā

(||vaṭṭi||)
balurāju sese sem̐ta pāḍiyum̐ baṁtamĕgāga
talabosi yĕvvarainām̐ dappu gŏnerā
valasinadāna nenu vaṁtulagu ninnu mīri
salamu sādiṁchenaṁṭe sāgam̐bŏyyīnā

(||vaṭṭi||)
magam̐ḍu vaṭṭidīsidenu manniṁchī naṁdurugāga
vĕgaḍu liṁtem̐ṭigi viḍumanerā
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
nagi sigguvaḍidenu nammigayyīnā