వట్టి దూరులు దూరీ వద్దన్న మానఁడు నన్ను
(॥పల్లవి॥)
వట్టి దూరులు దూరీ వద్దన్న మానఁడు నన్ను
యిట్టే తనకు నే యెరవులదాననా
(॥పట్టి॥)
తగవా తనతో నేను దంటతనాలఁ దిరుగ
నగితే తా నవ్వెఁగాక నాకేఁటికే
మగువ తాఁ బలుకఁగ మాటలాడనైతిననీ
మొగము చూచితేనిట్టే మొక్కనైతినా
(॥పట్టి॥)
అదననిప్పుడే నన్నునండనే కూచుండుమనీ
యిదివో మగనాలికినింత చెల్లునా
పదరి నేను చలము పట్టుకున్న దానననీ
వొదిగి తాఁ జెనకఁగా నూరకుండనైతినా
(॥పట్టి॥)
కడమా తనమోము కాఁగిలించీ నన్నింతలో
జడిసేనా నే నేమైనా సమరతికి
బడినే శ్రీవేంకటాద్రిపతి నేనలమేల్మంగఁ
గడఁగిఁ తాఁ గలయఁగ కానిమ్మననైతినా
(||pallavi||)
vaṭṭi dūrulu dūrī vaddanna mānam̐ḍu nannu
yiṭṭe tanagu ne yĕravuladānanā
(||paṭṭi||)
tagavā tanado nenu daṁṭadanālam̐ diruga
nagide tā navvĕm̐gāga nāgem̐ṭige
maguva tām̐ balugam̐ga māḍalāḍanaidinanī
mŏgamu sūsideniṭṭe mŏkkanaidinā
(||paṭṭi||)
adananippuḍe nannunaṁḍane kūsuṁḍumanī
yidivo maganāliginiṁta sĕllunā
padari nenu salamu paṭṭugunna dānananī
vŏdigi tām̐ jĕnagam̐gā nūraguṁḍanaidinā
(||paṭṭi||)
kaḍamā tanamomu kām̐giliṁchī nanniṁtalo
jaḍisenā ne nemainā samaradigi
baḍine śhrīveṁkaḍādribadi nenalamelmaṁgam̐
gaḍam̐gim̐ tām̐ galayam̐ga kānimmananaidinā