వట్టి దూరు మాకేల వద్దయ్యా
(॥పల్లవి॥)
వట్టి దూరు మాకేల వద్దయ్యా
చిట్టకాలిట్లా నీవు సేసేటికొరకా
(॥వట్టి॥)
యెరవై సవతులిఁక నేమందురో మాయింటికి
వరుస దప్పి రానేల వద్దయ్యా
తరువాతవారు నేము దగ్గరి వాదడువఁగా
వొరసి నీవు నవ్వుతానుండేటికొరకా
(॥వట్టి॥)
ఆరసి నీకు బిగువైన వుంగరమిచ్చేవు
వారి సొమ్ము నాకేల వద్దయ్యా
గార వాననాపె యిది కని నన్నడుగ రాఁగా
నారుకొన నీవప్పుడు నవ్వేటికొరకా
(॥వట్టి॥)
ముచ్చటనిందరు మోచి దించవలెనంటా
వచ్చి నాకొంగు వట్టేవు వద్దయ్యా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
పచ్చిగా నన్నురమునఁ బాయకుండేకొరకా
(||pallavi||)
vaṭṭi dūru māgela vaddayyā
siṭṭagāliṭlā nīvu seseḍigŏragā
(||vaṭṭi||)
yĕravai savadulim̐ka nemaṁduro māyiṁṭigi
varusa dappi rānela vaddayyā
taruvādavāru nemu daggari vādaḍuvam̐gā
vŏrasi nīvu navvudānuṁḍeḍigŏragā
(||vaṭṭi||)
ārasi nīgu biguvaina vuṁgaramichchevu
vāri sŏmmu nāgela vaddayyā
gāra vānanābĕ yidi kani nannaḍuga rām̐gā
nārugŏna nīvappuḍu navveḍigŏragā
(||vaṭṭi||)
muchchaḍaniṁdaru mosi diṁchavalĕnaṁṭā
vachchi nāgŏṁgu vaṭṭevu vaddayyā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
pachchigā nannuramunam̐ bāyaguṁḍegŏragā