Vatti deemasamulele vanida neegu

వట్టి దీమసములేలే వనిత నీకు
Language

(॥పల్లవి॥)
వట్టి దీమసములేలే వనిత నీకు
గుట్టుతోడి నీగుణ మక్కునఁ బోసి చూపేవా

(॥వట్టి॥)
అగ్గలపుఁదమకాన ఆతఁడు వీడెమిచ్చితే
వొగ్గి పిడికిటఁ బట్టుకుం దానవేమే
సిగ్గులీవేళనేఁటికే సెలవుల నవ్వులేలే
కగ్గి యీతనిమాఁటకుఁ గాదనఁగలవా

(॥వట్టి॥)
కడఁగి నీవేలనుంగరమాతఁడు వెట్టితే
వొడిలోనఁ జెయివెట్టుకుందానవేమే
వెడవెడమోనాలేలే వేసాలు చూపుఁగనేలే
తొడరి యీతనియాన తోయంగఁ గలవా

(॥వట్టి॥)
శ్రీ వేంకటేశుఁడు సేస శిరసుపైఁ జల్లితేను
కూవగాఁ గొప్పులో దాఁచుకొనేవేమే
యీవేళ నన్నేలి మఱి యీతఁడే నిన్నునేలె
సోవలనీతనిమోవిఁ జొక్కకుండఁగలవా

(||pallavi||)
vaṭṭi dīmasamulele vanida nīgu
guṭṭudoḍi nīguṇa makkunam̐ bosi sūbevā

(||vaṭṭi||)
aggalabum̐damagāna ādam̐ḍu vīḍĕmichchide
vŏggi piḍigiḍam̐ baṭṭuguṁ dānaveme
siggulīveḽanem̐ṭige sĕlavula navvulele
kaggi yīdanimām̐ṭagum̐ gādanam̐galavā

(||vaṭṭi||)
kaḍam̐gi nīvelanuṁgaramādam̐ḍu vĕṭṭide
vŏḍilonam̐ jĕyivĕṭṭuguṁdānaveme
vĕḍavĕḍamonālele vesālu sūbum̐ganele
tŏḍari yīdaniyāna toyaṁgam̐ galavā

(||vaṭṭi||)
śhrī veṁkaḍeśhum̐ḍu sesa śhirasubaim̐ jallidenu
kūvagām̐ gŏppulo dām̐sugŏneveme
yīveḽa nanneli maṟi yīdam̐ḍe ninnunelĕ
sovalanīdanimovim̐ jŏkkaguṁḍam̐galavā