Vatti boodagaana vadi nannu doorevu

వట్టి బూటకాన వడి నన్ను దూరేవు
Language

(॥పల్లవి॥)
వట్టి బూటకాన వడి నన్ను దూరేవు
దట్టించి ముట్టితే తాఁకీనటరా

(॥వట్టి॥)
కొప్పువట్టితీసి గోర గీరితే
యిప్పుడింతలోనే యేమాయరా
వుప్పతించి నిన్ను నొట్టువెట్టితే
కప్పిననీమేను కనుగందెనటరా

(॥వట్టి॥)
తిలకించి చూచి తిట్టుదిట్టితే
యెలమి నింతలో నేమాయరా
లలి సరసాన లావు చూపితే
అలసి నీ వుర మగడాయనటరా

(॥వట్టి॥)
సారె గాఁగిలించి చన్నుల నొత్తితే
యేరా యింతలోనే యేమాయరా
యీరీతి శ్రీవేంకటేశ నేఁ గూడితే
బీరపునీమోవి పిప్పాయనటరా

(||pallavi||)
vaṭṭi būḍagāna vaḍi nannu dūrevu
daṭṭiṁchi muṭṭide tām̐kīnaḍarā

(||vaṭṭi||)
kŏppuvaṭṭidīsi gora gīride
yippuḍiṁtalone yemāyarā
vuppadiṁchi ninnu nŏṭṭuvĕṭṭide
kappinanīmenu kanugaṁdĕnaḍarā

(||vaṭṭi||)
tilagiṁchi sūsi tiṭṭudiṭṭide
yĕlami niṁtalo nemāyarā
lali sarasāna lāvu sūbide
alasi nī vura magaḍāyanaḍarā

(||vaṭṭi||)
sārĕ gām̐giliṁchi sannula nŏttide
yerā yiṁtalone yemāyarā
yīrīdi śhrīveṁkaḍeśha nem̐ gūḍide
bīrabunīmovi pippāyanaḍarā