Vatti beerabumaadalu vaddu naadonu

వట్టి బీరపుమాటలు వద్దు నాతోను
Language

(॥పల్లవి॥)
వట్టి బీరపుమాటలు వద్దు నాతోను
జట్టిగొని నా మోవిచవి నీ వెఱఁగవా

(॥వట్టి॥)
పక్కన నీతో నేను పంతమాడుకొనఁగాని
యిక్కువ కాకంటె హితు లెవ్వరున్నారు
గుక్కక నీవప్పటిని గుట్టు సేసే వింతే కాక
మిక్కిలి నాపైఁజేసిన మేలు నీ వెఱఁగవా

(॥వట్టి॥)
వింతలుగ నీతో నేను వేసాలు నెరపఁగాని
యింతులు నావలె సేవ లిటు సేసేరా
మంతుకెక్కి నీవప్పటి మఱఁగు పెట్టేవు గాక
అంతటి నాపై తమక మాఁపఁగలవా

(॥వట్టి॥)
ఆరీతి నీతో నేను ఆనవెట్టుకోఁ గాని
నేరుపులు నావల్ల నీ వెఱఁగవా
ఔరా శ్రీ వేంకటేశ అలమేలుమంగనేను
తారుకాణరతులెల్లా దాఁచఁగలవా

(||pallavi||)
vaṭṭi bīrabumāḍalu vaddu nādonu
jaṭṭigŏni nā movisavi nī vĕṟam̐gavā

(||vaṭṭi||)
pakkana nīdo nenu paṁtamāḍugŏnam̐gāni
yikkuva kāgaṁṭĕ hidu lĕvvarunnāru
gukkaga nīvappaḍini guṭṭu sese viṁte kāga
mikkili nābaim̐jesina melu nī vĕṟam̐gavā

(||vaṭṭi||)
viṁtaluga nīdo nenu vesālu nĕrabam̐gāni
yiṁtulu nāvalĕ seva liḍu seserā
maṁtugĕkki nīvappaḍi maṟam̐gu pĕṭṭevu gāga
aṁtaḍi nābai tamaga mām̐pam̐galavā

(||vaṭṭi||)
ārīdi nīdo nenu ānavĕṭṭugom̐ gāni
nerubulu nāvalla nī vĕṟam̐gavā
aurā śhrī veṁkaḍeśha alamelumaṁganenu
tārugāṇaradulĕllā dām̐sam̐galavā