Vasudhalo niduvamtivaaroom gomdaru galaru

వసుధలో నిటువంటివారూఁ గొందరు గలరు
Language

(॥పల్లవి॥)
వసుధలో నిటువంటివారూఁ గొందరు గలరు
కొసరక రమణుఁడు గుట్టుతో నోరుచునే

(॥॥)
సిగ్గరికత్తెకుఁ గాని చెక్కుటి చెయ్యమరదు
యెగ్గులాఁడిగాని మరి యీసునేరదు
బగ్గడికిఁగాని వట్టిపంతము లీడేరవు
వెగ్గళించి నీతలనే వేగెనటవే

(॥॥)
కతలకారికిఁ గాని కాఁతాళము గలుగదు
మతకరిగాని మర్మము లంటదు
ఆతిగర్వికిఁగాని గయ్యాళితనము రాదు
గతిమాలి కొసర నీకడమాయనటవే

(॥॥)
మాయ దారికిఁగాని మాటలు నోరికి రావు
కాయాటుదిగాని రతికాఁక కోర్వదు
యీయెడ శ్రీ వేంకటేశుఁడిన్నిటా నన్నుఁ గూడే
చాయసేసుకొని నీవే జాణ వైతివటవే

(||pallavi||)
vasudhalo niḍuvaṁṭivārūm̐ gŏṁdaru galaru
kŏsaraga ramaṇum̐ḍu guṭṭudo norusune

(||||)
siggarigattĕgum̐ gāni sĕkkuḍi sĕyyamaradu
yĕggulām̐ḍigāni mari yīsuneradu
baggaḍigim̐gāni vaṭṭibaṁtamu līḍeravu
vĕggaḽiṁchi nīdalane vegĕnaḍave

(||||)
kadalagārigim̐ gāni kām̐tāḽamu galugadu
madagarigāni marmamu laṁṭadu
ādigarvigim̐gāni gayyāḽidanamu rādu
gadimāli kŏsara nīgaḍamāyanaḍave

(||||)
māya dārigim̐gāni māḍalu norigi rāvu
kāyāḍudigāni radigām̐ka korvadu
yīyĕḍa śhrī veṁkaḍeśhum̐ḍinniḍā nannum̐ gūḍe
sāyasesugŏni nīve jāṇa vaidivaḍave