(॥పల్లవి॥)
వరుసలు వెట్టుక వైపుగను
తరచు రతులచేఁ దనుపఁగ రాదా
(॥॥)
వలపుల చెమటల వానలు గురియఁగ
పలుమరుఁ దడిసెను పయ్యదలు
కొలువులో సిగ్గునఁ గొంకేరింతులు
మలశొకరొకరినే మన్నించ రాదా
(॥॥)
పాయపు మదముల పదనులు దొలుకరి
చాయల కొప్పులు జారీనదే
ఆయములు గరఁగి అలసేరింతులు
యీయడ మునుముగ నెనయఁగ రాదా
(॥॥)
పగటుల పులకల పదనులు నించఁగ
సొగిసి చన్నులరాసులు నెగడె
జిగిఁ గూడిరిందరు శ్రీవేంకటేశ్వర
తగిలి ఇట్లా దయ దలఁచఁగ రాదా
(||pallavi||)
varusalu vĕṭṭuga vaibuganu
tarasu radulasem̐ danubam̐ga rādā
(||||)
valabula sĕmaḍala vānalu guriyam̐ga
palumarum̐ daḍisĕnu payyadalu
kŏluvulo siggunam̐ gŏṁkeriṁtulu
malaśhŏgarŏgarine manniṁcha rādā
(||||)
pāyabu madamula padanulu dŏlugari
sāyala kŏppulu jārīnade
āyamulu garam̐gi alaseriṁtulu
yīyaḍa munumuga nĕnayam̐ga rādā
(||||)
pagaḍula pulagala padanulu niṁcham̐ga
sŏgisi sannularāsulu nĕgaḍĕ
jigim̐ gūḍiriṁdaru śhrīveṁkaḍeśhvara
tagili iṭlā daya dalam̐sam̐ga rādā