వరుసకు రాకుంటే వావి దప్పీనా
(॥పల్లవి॥)
వరుసకు రాకుంటే వావి దప్పీనా
వెర విందు కేది గోవిందరాజా
(॥వరు॥)
చిందేటి తేనే మోవితో చెలి నీతో మాటలాడెఁ
నందుకంటె నేమిసేసు నదిచాలదా
ముందే మొల్లచూపులను ముంచి చల్లఁగాఁ జూచె
కందువైన దిందుకంటె కలదా ప్రియము
(॥వరు॥)
వెన్నెల సెలవి తోడ వెలఁది నీతో నవ్వె
యిన్నిటా నీయాసోద మిఁక నెంతయ్యా
అన్నువచంద్రునివంటిఆననము నీకుఁజూపె
యిన్నేసిచేఁతలు సేసె నిఁకనేమి గడమ
(॥వరు॥)
చిగురుఁదీగెలవంటిచేతులు నీపై వేసె
తగవులన్నియుఁదేరె తారుకాణేలా
పగటుశ్రీవేంకటాద్రిపతి విట్టె కూడితివి
జగడాలిన్నియుఁ బాసె చనవింత చాలదా
(||pallavi||)
varusagu rāguṁṭe vāvi dappīnā
vĕra viṁdu kedi goviṁdarājā
(||varu||)
siṁdeḍi tene movido sĕli nīdo māḍalāḍĕm̐
naṁdugaṁṭĕ nemisesu nadisāladā
muṁde mŏllasūbulanu muṁchi sallam̐gām̐ jūsĕ
kaṁduvaina diṁdugaṁṭĕ kaladā priyamu
(||varu||)
vĕnnĕla sĕlavi toḍa vĕlam̐di nīdo navvĕ
yinniḍā nīyāsoda mim̐ka nĕṁtayyā
annuvasaṁdrunivaṁṭiānanamu nīgum̐jūbĕ
yinnesisem̐talu sesĕ nim̐kanemi gaḍama
(||varu||)
sigurum̐dīgĕlavaṁṭisedulu nībai vesĕ
tagavulanniyum̐derĕ tārugāṇelā
pagaḍuśhrīveṁkaḍādribadi viṭṭĕ kūḍidivi
jagaḍālinniyum̐ bāsĕ sanaviṁta sāladā