Varusagu nee magamdu vachcheemgaaga

వరుసకు నీ మగఁదు వచ్చీఁగాక
Language

(॥పల్లవి॥)
వరుసకు నీ మగఁదు వచ్చీఁగాక
సరసురాలగు నీకుఁ జలపట్టనేఁటికి

(॥వరు॥)
వాసితోడఁ బతిమీఁద వలపు గలదానికి
వేసరఁగనేఁటికే వేమారును
రాసికెక్క నేఁడు సింగారమున నుండి నీకు
సేసకొప్పు వేఁకమంటాఁ జింతించనేఁటికే

(॥వరు॥)
పనివడి నాయకునిఁ బాయలేని దానికి
పెనఁగఁగ నేఁటికే బిగియుచును
వెనుకొని జవ్వనాన విఱ్ఱవీఁగే యట్టి నీకు
చనుఁగవ గట్టి యంటా జడియఁగ నేఁటికే

(॥వరు॥)
అన్నిటా శ్రీ వేంకటేశునాలవైన దానికి
సన్నసేయనేఁటికే సముకమున
వెన్నెల నవ్వులతోడ వేడక పడే నీకు
కన్నులివి గొప్పలంటా కావరించ నేఁటికే

(||pallavi||)
varusagu nī magam̐du vachchīm̐gāga
sarasurālagu nīgum̐ jalabaṭṭanem̐ṭigi

(||varu||)
vāsidoḍam̐ badimīm̐da valabu galadānigi
vesaram̐ganem̐ṭige vemārunu
rāsigĕkka nem̐ḍu siṁgāramuna nuṁḍi nīgu
sesagŏppu vem̐kamaṁṭām̐ jiṁtiṁchanem̐ṭige

(||varu||)
panivaḍi nāyagunim̐ bāyaleni dānigi
pĕnam̐gam̐ga nem̐ṭige bigiyusunu
vĕnugŏni javvanāna viṭravīm̐ge yaṭṭi nīgu
sanum̐gava gaṭṭi yaṁṭā jaḍiyam̐ga nem̐ṭige

(||varu||)
anniḍā śhrī veṁkaḍeśhunālavaina dānigi
sannaseyanem̐ṭige samugamuna
vĕnnĕla navvuladoḍa veḍaga paḍe nīgu
kannulivi gŏppalaṁṭā kāvariṁcha nem̐ṭige