Varusagaani varusa vatturaa taanu

వరుసగాని వరుస వత్తురా తాను
Language

(॥పల్లవి॥)
వరుసగాని వరుస వత్తురా తాను
అరసి నీవొకమాటు అడుగరాదా

(॥వరు॥)
మిక్కిలి నీతో నేను మేలములాడఁగాను
అక్కరతోఁ జూడవచ్చే నాపె యెవ్వతో
ఇక్కువచెప్పి నీవే యీడకు రమ్మనంటివో
యెక్కువైనతనవొళ్లి యెడ్డతనమో

(॥వరు॥)
పొందుల నీవు నాపొత్తుల నారగించఁగా
విందులు చెప్పఁగవచ్చీ వెలఁదెవ్వతో
యిందుకు నీవు ఆసలేమైనాఁ బెట్టితివో
దిందుపడి తనలోనిదిట్టకూళతనమో

(॥వరు॥)
నేనలమేల్మంగనై నిన్నుఁ గూడివుండఁగాను
కానుక లియ్యఁగవచ్చీఁ గాంత యెవ్వతో
పూని శ్రీవేంకటేశుఁడ పొంది నీమతకమో
తానే నేరుచుకొనినదంటతనమో

(||pallavi||)
varusagāni varusa vatturā tānu
arasi nīvŏgamāḍu aḍugarādā

(||varu||)
mikkili nīdo nenu melamulāḍam̐gānu
akkaradom̐ jūḍavachche nābĕ yĕvvado
ikkuvasĕppi nīve yīḍagu rammanaṁṭivo
yĕkkuvainadanavŏḽli yĕḍḍadanamo

(||varu||)
pŏṁdula nīvu nābŏttula nāragiṁcham̐gā
viṁdulu sĕppam̐gavachchī vĕlam̐dĕvvado
yiṁdugu nīvu āsalemainām̐ bĕṭṭidivo
diṁdubaḍi tanalonidiṭṭagūḽadanamo

(||varu||)
nenalamelmaṁganai ninnum̐ gūḍivuṁḍam̐gānu
kānuga liyyam̐gavachchīm̐ gāṁta yĕvvado
pūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏṁdi nīmadagamo
tāne nerusugŏninadaṁṭadanamo