Varusado ramanuni valabimchavalem gaaga

వరుసతో రమణుని వలపించవలెఁ గాక
Language

(॥పల్లవి॥)
వరుసతో రమణుని వలపించవలెఁ గాక
సరసము లాడితేనే సవతులైరా తాము

(॥॥)
కాంతుని నూరకైనా కన్నుల జంకించితేనే
పంతములు వచ్చెనా పడఁతులకు
చెంతనుండి సెలవుల చిఱునవ్వు నవ్వితేనే
బంతి నన్నిటా నేరుపరులైరా తాము

(॥॥)
చనవున నాతని చన్నులఁ దాకించితేనే
తనిసెనా మనసులు తమకెల్లాను
వినయానఁ బాదాలు వేమారుఁ బిసికితేనే
పెనఁగినవారైనా బీరపు రతులనూ

(॥॥)
వలవని జోలి తోడ వద్దఁగాచుకుండితేనే
చలములు దక్కెనా నా చక్క జాడను
యెలమి శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
పలికినంతటిలోనే పనులు చేకూరీనా

(||pallavi||)
varusado ramaṇuni valabiṁchavalĕm̐ gāga
sarasamu lāḍidene savadulairā tāmu

(||||)
kāṁtuni nūragainā kannula jaṁkiṁchidene
paṁtamulu vachchĕnā paḍam̐tulagu
sĕṁtanuṁḍi sĕlavula siṟunavvu navvidene
baṁti nanniḍā nerubarulairā tāmu

(||||)
sanavuna nādani sannulam̐ dāgiṁchidene
tanisĕnā manasulu tamagĕllānu
vinayānam̐ bādālu vemārum̐ bisigidene
pĕnam̐ginavārainā bīrabu radulanū

(||||)
valavani joli toḍa vaddam̐gāsuguṁḍidene
salamulu dakkĕnā nā sakka jāḍanu
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone nannum̐gūḍĕ
paliginaṁtaḍilone panulu segūrīnā