వరుసతో నిద్దరికి వలపు వంచిపెట్టేవు
(॥పల్లవి॥)
వరుసతో నిద్దరికి వలపు వంచిపెట్టేవు
యిరుమేలా నీయాస యెంతగలదయ్యా
(॥వరు॥)
గుట్టుతో నాపెచేతను కొప్పు దువ్వించుకొంటివి
అటెప సారెసారె విడే లందుకొంటివి
చుట్టరికపుఁదనాన సుద్దులు నడిగితివి
మట్టుమీరి మాతో నవ్వ మరియేఁటికయ్యా
(॥వరు॥)
పనివూని యాపెచేత పాదా లోత్తించుకొంటివి
పెనఁగేపె వుంగర మిప్పించుకొంటివి
చనుఁగవ నొరయఁగ సరసములాడితివి
చెనకుచు మాపైనేల చేయిచాఁచేవయ్యా
(॥వరు॥)
తోలుత నాపెచేత రతులఁ జొక్కించుకొంటివి
నిలువునఁ బెఁజెమట నించుకొంటివి
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
లలి నన్నేలి ఇద్దరి లాలించేవు మేలయ్యా
(||pallavi||)
varusado niddarigi valabu vaṁchibĕṭṭevu
yirumelā nīyāsa yĕṁtagaladayyā
(||varu||)
guṭṭudo nābĕsedanu kŏppu duvviṁchugŏṁṭivi
aḍĕba sārĕsārĕ viḍe laṁdugŏṁṭivi
suṭṭarigabum̐danāna suddulu naḍigidivi
maṭṭumīri mādo navva mariyem̐ṭigayyā
(||varu||)
panivūni yābĕseda pādā lottiṁchugŏṁṭivi
pĕnam̐gebĕ vuṁgara mippiṁchugŏṁṭivi
sanum̐gava nŏrayam̐ga sarasamulāḍidivi
sĕnagusu mābainela seyisām̐sevayyā
(||varu||)
toluda nābĕseda radulam̐ jŏkkiṁchugŏṁṭivi
niluvunam̐ bĕm̐jĕmaḍa niṁchugŏṁṭivi
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
lali nanneli iddari lāliṁchevu melayyā