వరుస నెఱుఁగనట్లా వచ్చి యీడ నున్నాఁడవు
(॥పల్లవి॥)
వరుస నెఱుఁగనట్లా వచ్చి యీడ నున్నాఁడవు
యెరవులవారికి మా యింటికినీఁ దెత్తురా
(॥వరు॥)
కందువ నీ పానుపుపై కంకణము వడి యుండె
యిందవయ్యా నీ కాంతది యెవ్వతెదో
చిందిన తట్టు పుణుఁగు చేయెల్లా నంటె నిదె
పొందుగా నీ మేన నిట్టే పూసుకొనవయ్యా
(॥వరు॥)
చిట్టంటుఁజెమట దోఁగి చెంగావిచీర యుండె
పట్టరాదా, యేవనిత గట్టుకొన్నదో
పట్టి చూచితే కప్పురపుబాగాలు మిగిలి యుండె
వెట్ట దేర నీవే, యివే వేసుకొనవయ్యా
(॥వరు॥)
అచ్చట పువ్వులచెండు లదిగో నలఁగి యుండె
పుచ్చుకోవయ్య యెవ్వతె భోగించినదో
అచ్చుగా శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
మచ్చెము లిద్దరిని నీ మది నెంచుకోవయ్యా
(||pallavi||)
varusa nĕṟum̐ganaṭlā vachchi yīḍa nunnām̐ḍavu
yĕravulavārigi mā yiṁṭiginīm̐ dĕtturā
(||varu||)
kaṁduva nī pānububai kaṁkaṇamu vaḍi yuṁḍĕ
yiṁdavayyā nī kāṁtadi yĕvvadĕdo
siṁdina taṭṭu puṇum̐gu seyĕllā naṁṭĕ nidĕ
pŏṁdugā nī mena niṭṭe pūsugŏnavayyā
(||varu||)
siṭṭaṁṭum̐jĕmaḍa dom̐gi sĕṁgāvisīra yuṁḍĕ
paṭṭarādā, yevanida gaṭṭugŏnnado
paṭṭi sūside kappurabubāgālu migili yuṁḍĕ
vĕṭṭa dera nīve, yive vesugŏnavayyā
(||varu||)
achchaḍa puvvulasĕṁḍu ladigo nalam̐gi yuṁḍĕ
puchchugovayya yĕvvadĕ bhogiṁchinado
achchugā śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
machchĕmu liddarini nī madi nĕṁchugovayyā