వరుస నే నెరుఁగుదు వాని గుణము
(॥పల్లవి॥)
వరుస నే నెరుఁగుదు వాని గుణము
కరఁగి నా పేరు వింటే కానుక లందియ్యరే
(॥వరుస॥)
తగనేఁ గోపగించిన దయ గల దాతనికి
బిగియఁడు వచ్చీఁ గాని పిల్వరే వాని
వొగి నే నంత దిట్టినా వోరువు గ ద్దాతనికి
నగుతా వచ్చీఁ గాని నా పేరు చెప్పరే
(॥వరుస॥)
మోనాన నేఁ గొసరినా మోహము గ ద్దాతనికి
పేని పట్టి వచ్చీఁ గాని పిల్వరే వాని
పూని నేనెం తలిగినా బుజ్జగించ నేర్చుఁ వాడు
వానికిఁ బొడచూపరే వచ్చీ నిందాఁకలను
(॥వరుస॥)
ముంపు నే గరివి నైనా మొదల వినయివాఁడు
పెంపున దానె వచ్చీఁ బిల్వరే వాని
యింపుల శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
పంపున నీడనె వుండీ పై పైనె మొక్కరే
(||pallavi||)
varusa ne nĕrum̐gudu vāni guṇamu
karam̐gi nā peru viṁṭe kānuga laṁdiyyare
(||varusa||)
taganem̐ gobagiṁchina daya gala dādanigi
bigiyam̐ḍu vachchīm̐ gāni pilvare vāni
vŏgi ne naṁta diṭṭinā voruvu ga ddādanigi
nagudā vachchīm̐ gāni nā peru sĕppare
(||varusa||)
monāna nem̐ gŏsarinā mohamu ga ddādanigi
peni paṭṭi vachchīm̐ gāni pilvare vāni
pūni nenĕṁ taliginā bujjagiṁcha nersum̐ vāḍu
vānigim̐ bŏḍasūbare vachchī niṁdām̐kalanu
(||varusa||)
muṁpu ne garivi nainā mŏdala vinayivām̐ḍu
pĕṁpuna dānĕ vachchīm̐ bilvare vāni
yiṁpula śhrīvĕṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
paṁpuna nīḍanĕ vuṁḍī pai painĕ mŏkkare