Varnaashramamulaala vadim jitraguptulaala

వర్ణాశ్రమములాల వడిఁ జిత్రగుప్తులాల
Language

(॥పల్లవి॥)
వర్ణాశ్రమములాల వడిఁ జిత్రగుప్తులాల
వర్ణించి మమ్మిఁకఁ దడవకురో మీరు

(॥వర్ణా॥)
చదువులు దెచ్చినట్టి సర్వేశుఁ గొలిచితి
చదువు నామారతఁడు చదివీఁ బోరో
అదన యోగీంద్రవంద్యుఁడైన కృష్ణుఁ గొలిచితి
చదల నాయోగములు సాదించు నతఁడే

(॥వర్ణా॥)
కూరిమి యజ్ఞకర్తైనగోవిందుఁ దలఁచితి
చేరి నామారతఁ డవి సేసీఁ బోరో
ఆరయ విజ్ఞానమూర్తియైన హరి శరణంటి
వూరకె నాకాతఁడవి వుత్తరువిచ్చీని

(॥వర్ణా॥)
దేవతాశిఖామణియైన దేవునిఁ బూజించితిని
దేవఋషిఋణములు తీరిచీఁబోరో
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నవాఁడు
చేవఁ బాపాలెల్లఁ బాసె సెలవిచ్చెఁ జేఁతలు

(||pallavi||)
varṇāśhramamulāla vaḍim̐ jitraguptulāla
varṇiṁchi mammim̐kam̐ daḍavaguro mīru

(||varṇā||)
saduvulu dĕchchinaṭṭi sarveśhum̐ gŏlisidi
saduvu nāmāradam̐ḍu sadivīm̐ boro
adana yogīṁdravaṁdyum̐ḍaina kṛṣhṇum̐ gŏlisidi
sadala nāyogamulu sādiṁchu nadam̐ḍe

(||varṇā||)
kūrimi yajñagardainagoviṁdum̐ dalam̐sidi
seri nāmāradam̐ ḍavi sesīm̐ boro
āraya vijñānamūrdiyaina hari śharaṇaṁṭi
vūragĕ nāgādam̐ḍavi vuttaruvichchīni

(||varṇā||)
devadāśhikhāmaṇiyaina devunim̐ būjiṁchidini
devaṛṣhiṛṇamulu tīrisīm̐boro
śhrīveṁkaḍeśhvarum̐ḍu sittamulo nunnavām̐ḍu
sevam̐ bābālĕllam̐ bāsĕ sĕlavichchĕm̐ jem̐talu