వన్నెకాఁడ వన్నిటాను వల్లభరాయ
(॥పల్లవి॥)
వన్నెకాఁడ వన్నిటాను వల్లభరాయ
వున్నసుద్దులేఁటికోయి వో వల్లభరాయా
(॥వన్నె॥)
వాడికైన వలపుల వల్లభరాయా
వాడుదేరె నీమోవి వల్లభరాయా
వాడవలపుల మెచ్చు వల్లభరాయ
వోడక నన్నేలుకొమ్మీ వో వల్లభరాయా
(॥వన్నె॥)
వలగొని మొక్కేము వల్లభరాయ నీ-
వలలఁ జిక్కితి మిదే వల్లభరాయా
వలెనా యింతేసి రట్టు వల్లభరాయ
వులివచ్చిమోవి యిమ్మీ వో వల్లభరాయా
(॥వన్నె॥)
వరునోరెఁపాటి వల్లభరాయా నేఁడు
వరుసకు రావోయి వల్లభరాయా
వరదుఁడ శ్రీవేంకట వల్లభరాయ మమ్ము-
నొరసికూడితి విట్టే వో వల్లభరాయా
(||pallavi||)
vannĕgām̐ḍa vanniḍānu vallabharāya
vunnasuddulem̐ṭigoyi vo vallabharāyā
(||vannĕ||)
vāḍigaina valabula vallabharāyā
vāḍuderĕ nīmovi vallabharāyā
vāḍavalabula mĕchchu vallabharāya
voḍaga nannelugŏmmī vo vallabharāyā
(||vannĕ||)
valagŏni mŏkkemu vallabharāya nī-
valalam̐ jikkidi mide vallabharāyā
valĕnā yiṁtesi raṭṭu vallabharāya
vulivachchimovi yimmī vo vallabharāyā
(||vannĕ||)
varunorĕm̐pāḍi vallabharāyā nem̐ḍu
varusagu rāvoyi vallabharāyā
varadum̐ḍa śhrīveṁkaḍa vallabharāya mammu-
nŏrasigūḍidi viṭṭe vo vallabharāyā