Vanidaro padidoda vattiguttu sellunadave

వనితరో పతితోడ వట్టిగుట్టు చెల్లునటవే
Language

(॥పల్లవి॥)
వనితరో పతితోడ వట్టిగుట్టు చెల్లునటవే
చొనిపి మోవితేనెలు చూపుదువుగాక

(॥వని॥)
బలుచన్నులు నీ వెంత పయ్యదలో దాఁచినాను
వలపులు మూటగట్ట వచ్చునటవే
తలవంచుకొని లోలో తమకము లాఁపినాను
చెలపలచెమటలు చిందకుండునటవే

(॥వని॥)
ధీరతతో నీ వెంత తెర వేకుండినాను
పారేటిమనసు పట్టుపరచేవటవే
కూరిమిమాఁటలు నోర గుబ్బతిల నణఁచిన
వీరిడినీ చిరునవ్వు వెళ్లకుండునటవే

(॥వని॥)
సన్నపుసిగ్గులతోడ సరిఁ దలవంచినాను
కన్నులచూపులు గంపఁగమ్మే వటే
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నింత లోనె
వున్నతపు వేడుక నీ వొట్టుకొనేవటవే

(||pallavi||)
vanidaro padidoḍa vaṭṭiguṭṭu sĕllunaḍave
sŏnibi movidenĕlu sūbuduvugāga

(||vani||)
balusannulu nī vĕṁta payyadalo dām̐sinānu
valabulu mūḍagaṭṭa vachchunaḍave
talavaṁchugŏni lolo tamagamu lām̐pinānu
sĕlabalasĕmaḍalu siṁdaguṁḍunaḍave

(||vani||)
dhīradado nī vĕṁta tĕra veguṁḍinānu
pāreḍimanasu paṭṭubarasevaḍave
kūrimimām̐ṭalu nora gubbadila naṇam̐sina
vīriḍinī sirunavvu vĕḽlaguṁḍunaḍave

(||vani||)
sannabusigguladoḍa sarim̐ dalavaṁchinānu
kannulasūbulu gaṁpam̐gamme vaḍe
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu niṁta lonĕ
vunnadabu veḍuga nī vŏṭṭugŏnevaḍave