Vanidalu neege valasu temarudu

వనితలు నీకే వలచు టేమరుదు
Language

(॥పల్లవి॥)
వనితలు నీకే వలచు టేమరుదు
వినయము చేకొని వెస నేలుదువూ

(॥॥)
సిగ్గులు దేర్తువు చెలుల మన నెఱిఁగి
యెగ్గులు వట్టక యెనయుదువూ
దిగ్గన నలుకలు దేర్చి మన్నింతువు
నిగ్గుల సతులకు నిధానమవూ

(॥॥)
సమ్మతి సేతువు చనవు లొసఁగుదువు
నమ్మఁదిరిగి మరి నవ్వుదువూ
తెమ్మలుగా మోవితేనె లొసఁగుదువు
కొమ్మల పాలిటి కొంగుపసిఁడివి

(॥॥)
తగవు నడపుదువు దయలు దలఁతువు
నిగిడి శ్రీ వేంకట నిలయుఁడవూ
జిగి నలమేలుమంగ నగు ననుఁ గూడితి
మగువలపాలిటి మనోరథమవూ.

(||pallavi||)
vanidalu nīge valasu ṭemarudu
vinayamu segŏni vĕsa neluduvū

(||||)
siggulu derduvu sĕlula mana nĕṟim̐gi
yĕggulu vaṭṭaga yĕnayuduvū
diggana nalugalu dersi manniṁtuvu
niggula sadulagu nidhānamavū

(||||)
sammadi seduvu sanavu lŏsam̐guduvu
nammam̐dirigi mari navvuduvū
tĕmmalugā movidenĕ lŏsam̐guduvu
kŏmmala pāliḍi kŏṁgubasim̐ḍivi

(||||)
tagavu naḍabuduvu dayalu dalam̐tuvu
nigiḍi śhrī veṁkaḍa nilayum̐ḍavū
jigi nalamelumaṁga nagu nanum̐ gūḍidi
maguvalabāliḍi manorathamavū.