Vanidalagum badigi valube keelu

వనితలకుఁ బతికి వలుపే కీలు
Language

(॥పల్లవి॥)
వనితలకుఁ బతికి వలుపే కీలు
ననుపు గలిగితేను నానుఁ బ్రియములూ

(॥॥)
చిత్తము వచ్చిన చోట సేవ లెల్లా నీడేరు
అత్తుగ డయితే మాట లనువు లౌను
పొత్తులు గలసితేను బోజనాలు రుచులౌను
బత్తి గలిగితేను యే పనులైనా నౌను

(॥॥)
చెలిమి సేసినచోట చెలఁగు మంచితనాలు
తలఁపు గలిగితేను తమి రేఁగును
బలిమిఁ బొగడితేను భావములు గరఁగును
నెలవై పాయకుండితే నిలుచు మచ్చికలూ

(॥॥)
కందువ గలుగు చోట కాఁపురాలు వేడుకలౌ
చందముగాఁ బెనఁగితే సరసమౌను
యిందునే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
పొందితివి నన్ను నిట్టే పొఁసగు మన్ననలూ

(||pallavi||)
vanidalagum̐ badigi valube kīlu
nanubu galigidenu nānum̐ briyamulū

(||||)
sittamu vachchina soḍa seva lĕllā nīḍeru
attuga ḍayide māḍa lanuvu launu
pŏttulu galasidenu bojanālu rusulaunu
batti galigidenu ye panulainā naunu

(||||)
sĕlimi sesinasoḍa sĕlam̐gu maṁchidanālu
talam̐pu galigidenu tami rem̐gunu
balimim̐ bŏgaḍidenu bhāvamulu garam̐gunu
nĕlavai pāyaguṁḍide nilusu machchigalū

(||||)
kaṁduva galugu soḍa kām̐purālu veḍugalau
saṁdamugām̐ bĕnam̐gide sarasamaunu
yiṁdune śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
pŏṁdidivi nannu niṭṭe pŏm̐sagu mannanalū