Vanidalado nela vattiguttu

వనితలతో నేల వట్టిగుట్టు
Language

(॥పల్లవి॥)
వనితలతో నేల వట్టిగుట్టు
చనవిచ్చితే వలపు చప్పనయ్యీనా

(॥వని॥)
చెక్కు నొక్కినవాఁడవు సేసవెట్టితే నేమాయ
తక్కక నీమీఁదట తప్పు మోచీనా
మొక్కించుకొన్నవాఁడవు మోవి ఇచ్చితే నేమాయ
వెక్కసపు నీ పంతము వెలితయ్యీనా

(॥వని॥)
కరఁగించినవాఁడవు కాలుదొక్కితే నేమాయ
వొరయ నీగుణము వేరొక్కటయ్యీనా
సరి నవ్వినవాఁడవు చన్నులంటితే నేమాయ
గరిమఁ జుట్టరికము గడ్డెము వేసేరా

(॥వని॥)
పెండిలాడినవాఁడవు పెనఁగితే నేమాయ
దుండగపుఁదమకాన దొమ్మిసేసేరా
అండ శ్రీవేంకటేశ నీ వటు మెచ్చితేనేమాయ
కొండుకపాయపు నిన్ను కొంగువట్టేరా

(||pallavi||)
vanidalado nela vaṭṭiguṭṭu
sanavichchide valabu sappanayyīnā

(||vani||)
sĕkku nŏkkinavām̐ḍavu sesavĕṭṭide nemāya
takkaga nīmīm̐daḍa tappu mosīnā
mŏkkiṁchugŏnnavām̐ḍavu movi ichchide nemāya
vĕkkasabu nī paṁtamu vĕlidayyīnā

(||vani||)
karam̐giṁchinavām̐ḍavu kāludŏkkide nemāya
vŏraya nīguṇamu verŏkkaḍayyīnā
sari navvinavām̐ḍavu sannulaṁṭide nemāya
garimam̐ juṭṭarigamu gaḍḍĕmu veserā

(||vani||)
pĕṁḍilāḍinavām̐ḍavu pĕnam̐gide nemāya
duṁḍagabum̐damagāna dŏmmiseserā
aṁḍa śhrīveṁkaḍeśha nī vaḍu mĕchchidenemāya
kŏṁḍugabāyabu ninnu kŏṁguvaṭṭerā