వనితల తలఁపులు వడ్డికిఁ బారీ నీమీఁద
(॥పల్లవి॥)
వనితల తలఁపులు వడ్డికిఁ బారీ నీమీఁద
యెనయు మెక్కడనైనా యేదుగాను సతుల
(॥వనిత॥)
చేతి నేసవడ్డవారు చేరియున్నారు నీవారె
ఆతల మరిఁ జెనకుమదిలాభము
లాతుగాఁ బదారువేలు లాయాలు నీనగరెల్లా
యీతలనింకాఁ గూర్చుమేదుగాను సతుల
(॥వనిత॥)
కలయఁ గొనినవారు కలరూరెల్లా నీవారే
అలరి మరిఁ గలయుమదిలాభము
తొలఁకే నందవ్రజపుదొడ్లే నీయందలాలు
యెలమినింకానుఁ దెమ్మా యేదుగాను సతుల
(॥వనిత॥)
ఉరము శిరసు వీఁపందున్నవారు నీవారె
అరయుమష్టమహిషులది లాభము
ధర శ్రీ వేంకటేశ నీతావెల్లా రాణివాసాలే
యిరవై మమ్మూనేలితివేదుగాను సతుల
(||pallavi||)
vanidala talam̐pulu vaḍḍigim̐ bārī nīmīm̐da
yĕnayu mĕkkaḍanainā yedugānu sadula
(||vanida||)
sedi nesavaḍḍavāru seriyunnāru nīvārĕ
ādala marim̐ jĕnagumadilābhamu
lādugām̐ badāruvelu lāyālu nīnagarĕllā
yīdalaniṁkām̐ gūrsumedugānu sadula
(||vanida||)
kalayam̐ gŏninavāru kalarūrĕllā nīvāre
alari marim̐ galayumadilābhamu
tŏlam̐ke naṁdavrajabudŏḍle nīyaṁdalālu
yĕlaminiṁkānum̐ dĕmmā yedugānu sadula
(||vanida||)
uramu śhirasu vīm̐paṁdunnavāru nīvārĕ
arayumaṣhṭamahiṣhuladi lābhamu
dhara śhrī veṁkaḍeśha nīdāvĕllā rāṇivāsāle
yiravai mammūnelidivedugānu sadula