Vanidala solabule valabula pamtalu

వనితల సొలపులె వలపుల పంటలు
Language

(॥పల్లవి॥)
వనితల సొలపులె వలపుల పంటలు
పెనఁగులాట గలితే ప్రియములే కావా

(॥వని॥)
తివిరి మగవానికే తీపులై యుందురుగాక
సవతులు తమలోన సంతమయ్యేరా
తవిలి నీవేల ఇందరి నొక్కటిసేసేవు
జవళి నీ కామేకులు చవులుగావా

(॥వని॥)
మొగిఁబెండ్లిపీఁటమీఁద మోనాన నుందురుగాక
వెగటై లోనికివస్తే వెంగేలేకావా
జగడాలు మానుమని సారె బుద్దులు చెప్పేవు
నగుతా నీ కవియెల్ల ననుపులు గావా

(॥వని॥)
శ్రీవేంకటేశ్వర నిన్నేచెంది కూడుదురు గాక
తాపుల తమలోనిపంతాలు మానేరా
యీవేళ నీ వేలితివి యెపుడు వారొక్కటే
యీవిధములెల్ల నీకు యితవులు గావా

(||pallavi||)
vanidala sŏlabulĕ valabula paṁṭalu
pĕnam̐gulāḍa galide priyamule kāvā

(||vani||)
tiviri magavānige tībulai yuṁdurugāga
savadulu tamalona saṁtamayyerā
tavili nīvela iṁdari nŏkkaḍisesevu
javaḽi nī kāmegulu savulugāvā

(||vani||)
mŏgim̐bĕṁḍlibīm̐ṭamīm̐da monāna nuṁdurugāga
vĕgaḍai lonigivaste vĕṁgelegāvā
jagaḍālu mānumani sārĕ buddulu sĕppevu
nagudā nī kaviyĕlla nanubulu gāvā

(||vani||)
śhrīveṁkaḍeśhvara ninnesĕṁdi kūḍuduru gāga
tābula tamalonibaṁtālu mānerā
yīveḽa nī velidivi yĕbuḍu vārŏkkaḍe
yīvidhamulĕlla nīgu yidavulu gāvā