Vanidagu nemtameluvaamdavo kaaga

వనితకు నెంతమేలువాఁడవో కాక
Language

(॥పల్లవి॥)
వనితకు నెంతమేలువాఁడవో కాక
యెనసి నవ్వేవు తగ వెంచుకొనవద్దా

(॥వని॥)
పూపచన్నులు వట్టితే పోపోమ్మని జంకించఁగా
ఆపెతోనే మాటలాడే వప్పటి నీవు
యేపున వేఁడుకొంటే యిందాఁకా బిగిసెను
చేపట్టితి వంతలోనే సిబ్బితైనా వలదా

(॥వని॥)
పూవుల నీవు వేసితే పూఁచి నిన్నానలువెట్టె
చేవట్టి తీసే వాపెనే చెల్లఁబో నీవు
భావించి నీవు చూచితే పయ్యద పైఁ గప్పుకొనె
వావులు చెప్పవచ్చేవు వాసెఱఁగవద్దా

(॥వని॥)
గుట్టునఁ గాఁగిలించితే కొప్పువట్టి తీసె నిన్ను
ఇట్టె మోవడిగేవు ఇంకా నీవు
నెట్టన శీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
జట్టి గొంటి వందరిని జంటసేయవలదా

(||pallavi||)
vanidagu nĕṁtameluvām̐ḍavo kāga
yĕnasi navvevu taga vĕṁchugŏnavaddā

(||vani||)
pūbasannulu vaṭṭide pobommani jaṁkiṁcham̐gā
ābĕdone māḍalāḍe vappaḍi nīvu
yebuna vem̐ḍugŏṁṭe yiṁdām̐kā bigisĕnu
sebaṭṭidi vaṁtalone sibbidainā valadā

(||vani||)
pūvula nīvu veside pūm̐si ninnānaluvĕṭṭĕ
sevaṭṭi tīse vābĕne sĕllam̐bo nīvu
bhāviṁchi nīvu sūside payyada paim̐ gappugŏnĕ
vāvulu sĕppavachchevu vāsĕṟam̐gavaddā

(||vani||)
guṭṭunam̐ gām̐giliṁchide kŏppuvaṭṭi tīsĕ ninnu
iṭṭĕ movaḍigevu iṁkā nīvu
nĕṭṭana śhīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
jaṭṭi gŏṁṭi vaṁdarini jaṁṭaseyavaladā