Vanida ninnidaa neevu vahimchugoga podu

వనిత నిన్నిటా నీవు వహించుకోక పోదు
Language

(॥పల్లవి॥)
వనిత నిన్నిటా నీవు వహించుకోక పోదు
వెనక ముందరి కిదె విన్నపము సుమ్మీ

(॥వనిత॥)
జవ్వన భారమెల్లా సతికుచముల నిండె
మువ్వంక విభుఁడ నీకు మోవక పోదు
చవ్వన మోహరసాలు చెమటలై దైవారె
వువ్వవిళ్లూరుచు నీకు నోలలాడవలసె

(॥వనిత॥)
కామాని కోరికెలెల్లా కనుచూపులై మెఱసె
దీమసాన నాది నీవే తీర్చక పోదు
ఆమనిగుణాలు మోవియందుఁ దేనెలై వుబ్బె
గోమున నీవిది చవిగొనక పోదు

(॥వనిత॥)
పొంచిన తమకములు పులకముత్తెములాయ
యెంచి నీమై నని సింగారించక పోదు
చంచుల శ్రీవేంకటేశ సతిఁ గూడితిని యిట్టె
కంచపు పొత్తులు మీకు కలయఁగఁ గలిగె

(||pallavi||)
vanida ninniḍā nīvu vahiṁchugoga podu
vĕnaga muṁdari kidĕ vinnabamu summī

(||vanida||)
javvana bhāramĕllā sadigusamula niṁḍĕ
muvvaṁka vibhum̐ḍa nīgu movaga podu
savvana moharasālu sĕmaḍalai daivārĕ
vuvvaviḽlūrusu nīgu nolalāḍavalasĕ

(||vanida||)
kāmāni korigĕlĕllā kanusūbulai mĕṟasĕ
dīmasāna nādi nīve tīrsaga podu
āmaniguṇālu moviyaṁdum̐ denĕlai vubbĕ
gomuna nīvidi savigŏnaga podu

(||vanida||)
pŏṁchina tamagamulu pulagamuttĕmulāya
yĕṁchi nīmai nani siṁgāriṁchaga podu
saṁchula śhrīveṁkaḍeśha sadim̐ gūḍidini yiṭṭĕ
kaṁchabu pŏttulu mīgu kalayam̐gam̐ galigĕ