Vanida neegum gadavaaramu gaamu

వనిత నీకుఁ గడవారము గాము
Language

(॥పల్లవి॥)
వనిత నీకుఁ గడవారము గాము
వొనరిన వలపులు వొక్కసరే సుమ్మీ

(॥వని॥)
వంచిన నా కనుఁగలువలకు చుట్టము నేఁడు
అంచెల నీమోముచంద్రుఁ డదియే సుమ్మీ
యించుకంత అనుమాన మిఁకనేల నీకునాకు
కంచపు పొత్తులు మోవిఁ గలసుఁజుమ్మీ

(॥వని॥)
నెలఁత నీ నడపు నెమలికి చుట్టము
మెలుపు నా నీలవర్ణమేమే సుమ్మీ
పలుకుల చిలుకలు పడఁతి నీకును నాకు
కులము పాఁగెన నొక్క గూఁటివాయ సుమ్మీ

(॥వని॥)
వనిత నా జవ్వన వసంతునికి చుట్టము
దినము నీ బాహలనే తీఁగెలే సుమ్మీ
యెనసితి శ్రీవేంకటేశుఁ డను నే నిదె
తనువులుఁదనువులు తారుకాణ సుమ్మీ

(||pallavi||)
vanida nīgum̐ gaḍavāramu gāmu
vŏnarina valabulu vŏkkasare summī

(||vani||)
vaṁchina nā kanum̐galuvalagu suṭṭamu nem̐ḍu
aṁchĕla nīmomusaṁdrum̐ ḍadiye summī
yiṁchugaṁta anumāna mim̐kanela nīgunāgu
kaṁchabu pŏttulu movim̐ galasum̐jummī

(||vani||)
nĕlam̐ta nī naḍabu nĕmaligi suṭṭamu
mĕlubu nā nīlavarṇameme summī
palugula silugalu paḍam̐ti nīgunu nāgu
kulamu pām̐gĕna nŏkka gūm̐ṭivāya summī

(||vani||)
vanida nā javvana vasaṁtunigi suṭṭamu
dinamu nī bāhalane tīm̐gĕle summī
yĕnasidi śhrīveṁkaḍeśhum̐ ḍanu ne nidĕ
tanuvulum̐danuvulu tārugāṇa summī