వనిత జవ్వనమున వసంతకాలము వచ్చె
(॥పల్లవి॥)
వనిత జవ్వనమున వసంతకాలము వచ్చె
ననిచి నీవు రాకుంటే నాయముగాదయ్యా
(॥వనిత॥)
పట్టపగలె యిటు పంకజాలు ముకుళించె
ఇట్టె విచారించ వీది యేలయ్యా
నెట్టన వేసవిలోన నీరు చిచ్చు గొనెఁ దీగె
పట్టి విచాంచకుంటేఁ బాపమయ్యా
(॥వనిత॥)
వుండుండె యకాలాన వూరకె సేమంతి వూచె
అండనట్టె తన్నడుగ వదేలయ్యా
నిండుఁ జింద్రుఁ డుదయించె నిక్కెవు కలువ లిదె
దండి విభుఁడవు నీకుఁ దగదయ్యా
(॥వనిత॥)
అద్దమరాతిరి గాకె అదె దిరిశము వూచె
సుద్దులెల్ల మాని చెలిఁ జూడవయ్యా
వొద్దిక శ్రీ వేంకటేశ వునిదఁ గూడితి విట్టె
పొద్దు పొద్దు పువ్వులు నీ పూజలయ్యా
(||pallavi||)
vanida javvanamuna vasaṁtagālamu vachchĕ
nanisi nīvu rāguṁṭe nāyamugādayyā
(||vanida||)
paṭṭabagalĕ yiḍu paṁkajālu muguḽiṁchĕ
iṭṭĕ visāriṁcha vīdi yelayyā
nĕṭṭana vesavilona nīru sichchu gŏnĕm̐ dīgĕ
paṭṭi visāṁchaguṁṭem̐ bābamayyā
(||vanida||)
vuṁḍuṁḍĕ yagālāna vūragĕ semaṁti vūsĕ
aṁḍanaṭṭĕ tannaḍuga vadelayyā
niṁḍum̐ jiṁdrum̐ ḍudayiṁchĕ nikkĕvu kaluva lidĕ
daṁḍi vibhum̐ḍavu nīgum̐ dagadayyā
(||vanida||)
addamarādiri gāgĕ adĕ diriśhamu vūsĕ
suddulĕlla māni sĕlim̐ jūḍavayyā
vŏddiga śhrī veṁkaḍeśha vunidam̐ gūḍidi viṭṭĕ
pŏddu pŏddu puvvulu nī pūjalayyā