(॥పల్లవి॥)
వంచన ప్రియములవారే కాక
నించిన కన్నీటి నేనేల నీకు
(॥వంచన॥)
గిలుకు మట్టెలతోడ కిందిచూపులతోడ
సెలవి నవ్వులు నీ పైఁ జిందఁగాను
వలతువుగాక యెవ్వతి కైనఁ జిత్తము
నిలుపఁగనోపని నేనేల నీకు
(॥వంచన॥)
గోడచాట్లతోడ కోనచీఁకటితోడ
వాడల నెలయించువారేకాక
వాడుచు లేమావి వడచల్ల వెడమాయ-
నీడలనెండే నేనేల నీకు
(॥వంచన॥)
జగడంబులతోడ సణఁగు సొలపుతోడ
వగ నిన్ను భ్రమయించువారె కాక
దిగులులేక నిన్ను తిరువేంకటేశుఁడ
నెగులెఱుఁగక కూడు నేనేల నీకు
(||pallavi||)
vaṁchana priyamulavāre kāga
niṁchina kannīḍi nenela nīgu
(||vaṁchana||)
gilugu maṭṭĕladoḍa kiṁdisūbuladoḍa
sĕlavi navvulu nī paim̐ jiṁdam̐gānu
valaduvugāga yĕvvadi kainam̐ jittamu
nilubam̐ganobani nenela nīgu
(||vaṁchana||)
goḍasāṭladoḍa konasīm̐kaḍidoḍa
vāḍala nĕlayiṁchuvāregāga
vāḍusu lemāvi vaḍasalla vĕḍamāya-
nīḍalanĕṁḍe nenela nīgu
(||vaṁchana||)
jagaḍaṁbuladoḍa saṇam̐gu sŏlabudoḍa
vaga ninnu bhramayiṁchuvārĕ kāga
digululega ninnu tiruveṁkaḍeśhum̐ḍa
nĕgulĕṟum̐gaga kūḍu nenela nīgu