Vamchagune shirasu valavani nerusu

వంచకునే శిరసు వలవని నెరుసు
Language

(॥పల్లవి॥)
వంచకునే శిరసు వలవని నెరుసు
పంచ చెట్టు మందుగాదు పలుకులింకేలే

(॥వంచ॥)
పట్టినదే చలమా పంతమే నీఫలమా
చుట్టపు చెలుల మింత చూఁడగలమా
యిట్టె యాతఁడు వచ్చిన నిద్దరును నొక్కటే
ఱట్టు వొలకమ్మ కెక్కె యిట్టెమాసు మిఁకను

(॥వంచ॥)
పొద్దులిట్టె జరపేవు బూటకాలే నెరపేవు
గద్దించి బుద్దులు మాకుఁ గరపేవు
వద్దువద్దు మాఁటలనే వలపులయేరు వారి
మద్దులు మారేళ్లు మోఁచె మానరాదా యిఁకను

(॥వంచ॥)
యింకనై తే బిగువూ యియ్యకొంటే తగవూ
వుంకువాయ మీకు నెలవుల నగవూ
పొంకపు శ్రీవేంకటేశుఁ బొందితి వింతటిలోన
చంక గుదె శరణార్తి చాలుఁజాలు నిఁకను

(||pallavi||)
vaṁchagune śhirasu valavani nĕrusu
paṁcha sĕṭṭu maṁdugādu paluguliṁkele

(||vaṁcha||)
paṭṭinade salamā paṁtame nīphalamā
suṭṭabu sĕlula miṁta sūm̐ḍagalamā
yiṭṭĕ yādam̐ḍu vachchina niddarunu nŏkkaḍe
ṟaṭṭu vŏlagamma kĕkkĕ yiṭṭĕmāsu mim̐kanu

(||vaṁcha||)
pŏdduliṭṭĕ jarabevu būḍagāle nĕrabevu
gaddiṁchi buddulu māgum̐ garabevu
vadduvaddu mām̐ṭalane valabulayeru vāri
maddulu māreḽlu mom̐sĕ mānarādā yim̐kanu

(||vaṁcha||)
yiṁkanai te biguvū yiyyagŏṁṭe tagavū
vuṁkuvāya mīgu nĕlavula nagavū
pŏṁkabu śhrīveṁkaḍeśhum̐ bŏṁdidi viṁtaḍilona
saṁka gudĕ śharaṇārdi sālum̐jālu nim̐kanu