వలెనా యింకా నంత వలపు గలయఁ బెట్ట
(॥పల్లవి॥)
వలెనా యింకా నంత వలపు గలయఁ బెట్ట
సళుపుఁ జూపులనాయ సమ తారుకాణలు
(॥వలెనా॥)
చేసినట్టిచేఁత లెల్లఁ జెల్లించ నీవు గలవు
ఆస చూపి నీకు మొక్క నాపె గలదు
యీసు లేక వోరుచుక యియ్యకొన నేఁగలను
రాసి కెక్క నీవు నవ్వు రాకుండునా యిఁకను
(॥వలెనా॥)
పసిఁడిపట్టెమంచము పవళించి వుండఁ గల
దసమున భోగించ నాపె గలదు
పసగా నుండఁగను నా బంగారుమేడ గలదు
వెస సంతంసాల విఱ్ఱవీఁగ వద్దా యిఁకను
(॥వలెనా॥)
వుంగరము వేలఁ బెట్ట నొరసి యాపె గలదు
సింగారించుకొనను నీ చేయి గలదు
అంగవించి నిన్నుఁ గూడేయందకు నేనూఁ గలను
చుంగుల శ్రీవేంకటేశ చొక్క వద్దా యింకను
(||pallavi||)
valĕnā yiṁkā naṁta valabu galayam̐ bĕṭṭa
saḽubum̐ jūbulanāya sama tārugāṇalu
(||valĕnā||)
sesinaṭṭisem̐ta lĕllam̐ jĕlliṁcha nīvu galavu
āsa sūbi nīgu mŏkka nābĕ galadu
yīsu lega vorusuga yiyyagŏna nem̐galanu
rāsi kĕkka nīvu navvu rāguṁḍunā yim̐kanu
(||valĕnā||)
pasim̐ḍibaṭṭĕmaṁchamu pavaḽiṁchi vuṁḍam̐ gala
dasamuna bhogiṁcha nābĕ galadu
pasagā nuṁḍam̐ganu nā baṁgārumeḍa galadu
vĕsa saṁtaṁsāla viṭravīm̐ga vaddā yim̐kanu
(||valĕnā||)
vuṁgaramu velam̐ bĕṭṭa nŏrasi yābĕ galadu
siṁgāriṁchugŏnanu nī seyi galadu
aṁgaviṁchi ninnum̐ gūḍeyaṁdagu nenūm̐ galanu
suṁgula śhrīveṁkaḍeśha sŏkka vaddā yiṁkanu