Valenaa neegimta dooru vanidalado nemdu

వలెనా నీకింత దూరు వనితలతో నేఁడు
Language

(॥పల్లవి॥)
వలెనా నీకింత దూరు వనితలతో నేఁడు
యెలమి నామాట విని యింటికి రావయ్యా

(॥॥)
ఆగడాలు నీవే నేసి యలగేవు రానంటా నీ -
లాగులు చూచినవారు లండఁడందురు
వేగుదాఁకా విరహాన వేసరి మా వంటివారు
యేగతి మన్నించఁడు వీఁడెంత కూళందురు

(॥॥)
వలచి చెయివట్టితే వాఁటముగా నవ్వేవు
తెలిసినవారు నిన్ను దిమ్మ రందురు
తలపోసి నీకుఁగా దప్పిఁబడ్డయాఁడువారు
చలమరి వీఁడేడ జాణఁడందురు

(॥॥)
ముంచిన ప్రియముతోడ మొక్కినాఁగై కొనకున్న
చంచలించినట్టివారు జడుఁడందురు
యెంచి చూచి శ్రీవేంకటేశ నన్నుఁగూడితివి
వంచ నింత లేకుండితే వడి గర్వి యందురు

(||pallavi||)
valĕnā nīgiṁta dūru vanidalado nem̐ḍu
yĕlami nāmāḍa vini yiṁṭigi rāvayyā

(||||)
āgaḍālu nīve nesi yalagevu rānaṁṭā nī -
lāgulu sūsinavāru laṁḍam̐ḍaṁduru
vegudām̐kā virahāna vesari mā vaṁṭivāru
yegadi manniṁcham̐ḍu vīm̐ḍĕṁta kūḽaṁduru

(||||)
valasi sĕyivaṭṭide vām̐ṭamugā navvevu
tĕlisinavāru ninnu dimma raṁduru
talabosi nīgum̐gā dappim̐baḍḍayām̐ḍuvāru
salamari vīm̐ḍeḍa jāṇam̐ḍaṁduru

(||||)
muṁchina priyamudoḍa mŏkkinām̐gai kŏnagunna
saṁchaliṁchinaṭṭivāru jaḍum̐ḍaṁduru
yĕṁchi sūsi śhrīveṁkaḍeśha nannum̐gūḍidivi
vaṁcha niṁta leguṁḍide vaḍi garvi yaṁduru