వలెనా అతనితో వాదులు నీకు । వో
(॥పల్లవి॥)
వలెనా అతనితో వాదులు నీకు । వో-
లలనా నీమనసు లక్కవంటిది
(॥వలె॥)
తగవా అతనితోఁ దారుకాణలు వో
మగువా అతఁ డెంత మన్నించినాను
నగవు సేసుక నీవు నడచుటింతే కాక
బిగువు చెల్ల దింత ప్రియునితో నీకు
(॥వలె॥)
అలుకలు యింకనేలే అతనితోను వో
కలికీ పిలిచితేఁ గాదనరాదు
పలుకుఁదేనె చల్లి పైకొనుటింతే కాక
చిలుకుఁజలములు చెల్లవిఁక నీకు
(॥వలె॥)
కలయకుండఁగనేలే కాంతునితో వో
చెలి అతఁడట్టె చేయిదాఁచఁగా
వెలయువలపు లవేడుక శ్రీవేంకటాద్రి
నిలయఁ డిదె కూడె నిట్టూర్పేలే నీకు
(||pallavi||)
valĕnā adanido vādulu nīgu | vo-
lalanā nīmanasu lakkavaṁṭidi
(||valĕ||)
tagavā adanidom̐ dārugāṇalu vo
maguvā adam̐ ḍĕṁta manniṁchinānu
nagavu sesuga nīvu naḍasuḍiṁte kāga
biguvu sĕlla diṁta priyunido nīgu
(||valĕ||)
alugalu yiṁkanele adanidonu vo
kaligī pilisidem̐ gādanarādu
palugum̐denĕ salli paigŏnuḍiṁte kāga
silugum̐jalamulu sĕllavim̐ka nīgu
(||valĕ||)
kalayaguṁḍam̐ganele kāṁtunido vo
sĕli adam̐ḍaṭṭĕ seyidām̐sam̐gā
vĕlayuvalabu laveḍuga śhrīveṁkaḍādri
nilayam̐ ḍidĕ kūḍĕ niṭṭūrbele nīgu