వలెఁగా యివి గొన్ని వైతాళాలు
(॥పల్లవి॥)
వలెఁగా యివి గొన్ని వైతాళాలు
చెలిమి సేసేయందుకు చెప్పింపవలెనా
(॥వలెగా॥)
తన కేలే వెరపు తరుణి నింతే నేను
చెనకగానే వద్దని చేయి వట్టేనా
అనుమాన మెల్లఁ బోసిఅలుక లిన్నియుఁ దేరే
మొనసి కూటమికి నా ముదల గావలెనా
(॥వలెగా॥)
యింక నేలే కొంకను యిదె నే చేతిలో దాన
కంకణాలచే నంటఁగాఁ గసరితినా
పొంకమాయఁ దనకు పొరుగుకు నే వచ్చితి
అంకెల సేసవెట్టి నా యప్పణ గావలెనా
(॥వలెగా॥)
ఆయ లేవే అగడు ఆలనై వున్నదాన నేను
యీయెడ దా నన్ను గూడ నేటి కంటినా
యేయెడా శ్రీవేంకటేశుఁ డిరవాయ తానే నాకు
పాయనరతుల కొడఁబరచఁగ వలెనా
(||pallavi||)
valĕm̐gā yivi gŏnni vaidāḽālu
sĕlimi seseyaṁdugu sĕppiṁpavalĕnā
(||valĕgā||)
tana kele vĕrabu taruṇi niṁte nenu
sĕnagagāne vaddani seyi vaṭṭenā
anumāna mĕllam̐ bosialuga linniyum̐ dere
mŏnasi kūḍamigi nā mudala gāvalĕnā
(||valĕgā||)
yiṁka nele kŏṁkanu yidĕ ne sedilo dāna
kaṁkaṇālase naṁṭam̐gām̐ gasaridinā
pŏṁkamāyam̐ danagu pŏrugugu ne vachchidi
aṁkĕla sesavĕṭṭi nā yappaṇa gāvalĕnā
(||valĕgā||)
āya leve agaḍu ālanai vunnadāna nenu
yīyĕḍa dā nannu gūḍa neḍi kaṁṭinā
yeyĕḍā śhrīveṁkaḍeśhum̐ ḍiravāya tāne nāgu
pāyanaradula kŏḍam̐barasam̐ga valĕnā