Valem gaa vesaalu vaddanna maanamdu

వలెఁ గా వేసాలు వద్దన్న మానఁడు
Language

(॥పల్లవి॥)
వలెఁ గా వేసాలు వద్దన్న మానఁడు
యెలయింపుల మాటల నెంత సేసీనె

(॥వలెగా॥)
కన్నుల నే మొక్కితేను కాఁక రేల రేఁగీనా
యిన్నీటాఁ జేతులు మోపి యేల చూపీనే
వెన్నెలబయట నుంటె వెత రేల రేఁగీనె
నిన్న నేటనె కతలు నేరిచేఁదాఁ గదవే

(॥వలెగా॥)
పొలసి నే నగితేను పులక లేల పుట్టీనె
యెలమిఁ జూడు మ నెన లేల పెట్టీనె
చిలుకలు వలికితే చింత లేల పొడమీనె
మలక లెల్లఁ బెనచేమాయకాఁడు గదవే

(॥వలెగా॥)
గక్కునఁ గాఁగిలించితె కడుఁ జెమరించ నేలె
మిక్కిలి గోర నూరిచి మీఁదఁ జిమ్మీనె
యెక్కువ శ్రీవెంకేశుఁ డెనసె నన్నిటా నన్ను
చక్కరసరసముల జాణకాఁడు గదవే

(||pallavi||)
valĕm̐ gā vesālu vaddanna mānam̐ḍu
yĕlayiṁpula māḍala nĕṁta sesīnĕ

(||valĕgā||)
kannula ne mŏkkidenu kām̐ka rela rem̐gīnā
yinnīḍām̐ jedulu mobi yela sūbīne
vĕnnĕlabayaḍa nuṁṭĕ vĕda rela rem̐gīnĕ
ninna neḍanĕ kadalu nerisem̐dām̐ gadave

(||valĕgā||)
pŏlasi ne nagidenu pulaga lela puṭṭīnĕ
yĕlamim̐ jūḍu ma nĕna lela pĕṭṭīnĕ
silugalu valigide siṁta lela pŏḍamīnĕ
malaga lĕllam̐ bĕnasemāyagām̐ḍu gadave

(||valĕgā||)
gakkunam̐ gām̐giliṁchidĕ kaḍum̐ jĕmariṁcha nelĕ
mikkili gora nūrisi mīm̐dam̐ jimmīnĕ
yĕkkuva śhrīvĕṁkeśhum̐ ḍĕnasĕ nanniḍā nannu
sakkarasarasamula jāṇagām̐ḍu gadave