వలెగా యివి గొన్ని వట్టి మాయలు
(॥పల్లవి॥)
(వలె?) గా యివి గొన్ని వట్టి మాయలు
వలవంత నేఁడు నేరవలసెఁగా నీకు
(॥వలెఁ॥)
ఆపెఇంటికిఁ బోతేను అంతలోనే దోసమా
చేపట్టి పెనఁగితేనే సిగ్గు వచ్చెనా
యీపాటివాఁడవు తొల్లి యేల పొందు సేసితివి
యేపున నన్నుఁ గని నేఁ డేల వెరచేవు
(॥వలెఁ॥)
కొంగు వట్టి తియ్యఁగాను కూచుండితే దోసమా
ముంగిట నవ్వితే నాయములు సోఁకెనా
యెంగిలికి రోసేవాఁడ వేల మొక్కించుకొంటివి
తొంగి చూచి నన్నుఁ గని తొలఁగఁగ దగునా
(॥వలెఁ॥)
యాన వెట్టఁగాను కూడితేనే దోసమా
యేరీతికిఁ జొచ్చినాను యెగ్గు లున్నవా
ఆరీతి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
వోరి నన్నుఁ గని యింతే శొడఁబా ట్లేలా
(||pallavi||)
(valĕ?) gā yivi gŏnni vaṭṭi māyalu
valavaṁta nem̐ḍu neravalasĕm̐gā nīgu
(||valĕm̐||)
ābĕiṁṭigim̐ bodenu aṁtalone dosamā
sebaṭṭi pĕnam̐gidene siggu vachchĕnā
yībāḍivām̐ḍavu tŏlli yela pŏṁdu sesidivi
yebuna nannum̐ gani nem̐ ḍela vĕrasevu
(||valĕm̐||)
kŏṁgu vaṭṭi tiyyam̐gānu kūsuṁḍide dosamā
muṁgiḍa navvide nāyamulu som̐kĕnā
yĕṁgiligi rosevām̐ḍa vela mŏkkiṁchugŏṁṭivi
tŏṁgi sūsi nannum̐ gani tŏlam̐gam̐ga dagunā
(||valĕm̐||)
yāna vĕṭṭam̐gānu kūḍidene dosamā
yerīdigim̐ jŏchchinānu yĕggu lunnavā
ārīdi śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
vori nannum̐ gani yiṁte śhŏḍam̐bā ṭlelā