వలె వలెనని వలచితినట తన వలలకు లోఁగానటరే ఇఁక
(॥పల్లవి॥)
వలె వలెనని వలచితినట తన వలలకు లోఁగానటరే ఇఁక
వలమో చలమో నాకును పతితో జగడములా
నెలఁతలు దన కెందరు గలిగిన నేనే సతమని తెలియరె
పొలమెల్లాఁ దిరిగిన తేఁటికి పూఁబొదయే నెలవుగదే*
(॥వలెవలె॥)
వాక్యం
ఆనఁగదరె వోచెలులాల అతినితోడుత నీమాటలె
వినయంబున నే నడవఁగ శ్రీవేంకటపతి కిది దగవా
(॥వలెవలె॥)
రామక్రియ, మఠెం
అల్లనాఁ డొకతెతోడ నట్టె మాటలాడఁగాను
చల్లఁగా నేనే చూచి జంకించితినా
పల్లదమాడితినటె పైఁడివంటిమాటనైన
చిల్లరే మానఁడాయ శ్రీవేంకటేశ్వరుఁడు
(॥వలెవలె॥)
వరాళి, రూపకం
తానాడినమాటలెల్లా దలచుమని
కోనేటియనికి నాగుబ్బలమీదటను
ఆనవెట్టరె
(॥వలెవలె॥)
బౌళి, ఝంపె
వెగ్గళముగ సారెకు నిక వెంగెములాగడగజాలను
సిగ్గరితనమున గొసరెద శేషాచలపతిని
(॥వలెవలె॥)
పాడి, తివుడ
అలిగి సాదించదగ దంజనాద్రీశ్వరుని
గలికిచూపులనె మది గరగజేసెదను
(॥వలెవలె॥)
నాట, ఆటతాళం
చనవుగలిగిన సరసమమమరును సముకమున నే మనసు దెలిసెద
మునుప నడుగరె మదజనకుని ముద్దుటుంగము
(॥వలెవలె॥)
శ్రీరాగం, ఏకతాళి
మాయింటికి నేడు రాగా మంకులూ బొంకులు దేరె
వేయినేల నే మొక్కెనే వేంకటరాయనికి
అలరివరతుల దొయ్యలులాల నన్ను
గలసె వేడుక శ్రీవేంకటవిభుడు
(||pallavi||)
valĕ valĕnani valasidinaḍa tana valalagu lom̐gānaḍare im̐ka
valamo salamo nāgunu padido jagaḍamulā
nĕlam̐talu dana kĕṁdaru galigina nene sadamani tĕliyarĕ
pŏlamĕllām̐ dirigina tem̐ṭigi pūm̐bŏdaye nĕlavugade*
(||valĕvalĕ||)
vākyaṁ
ānam̐gadarĕ vosĕlulāla adinidoḍuda nīmāḍalĕ
vinayaṁbuna ne naḍavam̐ga śhrīveṁkaḍabadi kidi dagavā
(||valĕvalĕ||)
rāmakriya, maṭhĕṁ
allanām̐ ḍŏgadĕdoḍa naṭṭĕ māḍalāḍam̐gānu
sallam̐gā nene sūsi jaṁkiṁchidinā
palladamāḍidinaḍĕ paim̐ḍivaṁṭimāḍanaina
sillare mānam̐ḍāya śhrīveṁkaḍeśhvarum̐ḍu
(||valĕvalĕ||)
varāḽi, rūbagaṁ
tānāḍinamāḍalĕllā dalasumani
koneḍiyanigi nāgubbalamīdaḍanu
ānavĕṭṭarĕ
(||valĕvalĕ||)
bauḽi, jhaṁpĕ
vĕggaḽamuga sārĕgu niga vĕṁgĕmulāgaḍagajālanu
siggaridanamuna gŏsarĕda śheṣhāsalabadini
(||valĕvalĕ||)
pāḍi, tivuḍa
aligi sādiṁchadaga daṁjanādrīśhvaruni
galigisūbulanĕ madi garagajesĕdanu
(||valĕvalĕ||)
nāḍa, āḍadāḽaṁ
sanavugaligina sarasamamamarunu samugamuna ne manasu dĕlisĕda
munuba naḍugarĕ madajanaguni mudduḍuṁgamu
(||valĕvalĕ||)
śhrīrāgaṁ, egadāḽi
māyiṁṭigi neḍu rāgā maṁkulū bŏṁkulu derĕ
veyinela ne mŏkkĕne veṁkaḍarāyanigi
alarivaradula dŏyyalulāla nannu
galasĕ veḍuga śhrīveṁkaḍavibhuḍu