(॥పల్లవి॥)
వలవు రచ్చల వేసేవారు గలరా
కులమునాండ్ల నింత గోర సేయ వలెనా
(॥వలప॥)
నేరుపునఁ గళ లంటి నివ్వెరగుఁ బొందించేవు
వీరు వారుఁ జూచి నన్ను వెఱ్ఱి యనరా
వూర కున్న నామీఁద వొక్కొక్క గురుతు సేసి
ఆరయ నిదెంత చిత్తి ణనిపించ వలెనా
(॥వలప॥)
చేతిమీఁద జేయి వేసి చెమరింపించేవు మేను
ఆతలివారు చూచి నన్నట్టె నవ్వరా
కాతరపుమాట లాడి కన్నులకెం పెక్కించేవు
యీతరుణిమదరాగ మిది యెమ్మె లనరా
(॥వలప॥)
రతి నేసి తెర దీసి రామలఁ బిలిపించేవు
అతివె లి దెంత పచ్చి యనరా నన్ను
గతిగా శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
యితవరి యిది యెంత యిచ్చకురా లనరా
(||pallavi||)
valavu rachchala vesevāru galarā
kulamunāṁḍla niṁta gora seya valĕnā
(||valaba||)
nerubunam̐ gaḽa laṁṭi nivvĕragum̐ bŏṁdiṁchevu
vīru vārum̐ jūsi nannu vĕṭri yanarā
vūra kunna nāmīm̐da vŏkkŏkka gurudu sesi
āraya nidĕṁta sitti ṇanibiṁcha valĕnā
(||valaba||)
sedimīm̐da jeyi vesi sĕmariṁpiṁchevu menu
ādalivāru sūsi nannaṭṭĕ navvarā
kādarabumāḍa lāḍi kannulagĕṁ pĕkkiṁchevu
yīdaruṇimadarāga midi yĕmmĕ lanarā
(||valaba||)
radi nesi tĕra dīsi rāmalam̐ bilibiṁchevu
adivĕ li dĕṁta pachchi yanarā nannu
gadigā śhrīvĕṁkaḍeśha kalasidi viḍu nannu
yidavari yidi yĕṁta yichchagurā lanarā