Valavani mohaavasthalam boraledi

వలవని మోహావస్థలఁ బొరలెడి
Language

(॥పల్లవి॥)
వలవని మోహావస్థలఁ బొరలెడి -
మలినం బెన్నఁడు మానును

(॥వల॥)
ఘెరదురితవికారంబుల
కారణ మెన్నఁడు దీరును
వైరముగొని తనువదలనిబంధపు -
భారం బెన్నఁడు వాయును

(॥వల॥)
జడమగుజిహ్వచాపల్యముగల -
వెడమతి యెన్నండు వీడును
చెడనిజీవునకు శ్రీవేంకటపతి-
కడుచూ పెన్నఁడు గటుగును

(||pallavi||)
valavani mohāvasthalam̐ bŏralĕḍi -
malinaṁ bĕnnam̐ḍu mānunu

(||vala||)
ghĕraduridavigāraṁbula
kāraṇa mĕnnam̐ḍu dīrunu
vairamugŏni tanuvadalanibaṁdhabu -
bhāraṁ bĕnnam̐ḍu vāyunu

(||vala||)
jaḍamagujihvasābalyamugala -
vĕḍamadi yĕnnaṁḍu vīḍunu
sĕḍanijīvunagu śhrīveṁkaḍabadi-
kaḍusū pĕnnam̐ḍu gaḍugunu